ETV Bharat / bharat

ఆటోకు NO.. బెంజ్​కు YES​.. సీఎం ఇంటి వద్ద బక్రీద్​ స్పెషల్​ బిర్యానీ కహానీ! - minister sent biryani in auto

Bakrid Special Biryani : బక్రీద్​ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఆసక్తికర ఘటన జరిగింది. ఓ మంత్రి.. సీఎంకు ఆటోలో బక్రీద్​ స్పెషల్​ బిర్యానీ పంపించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని వెనక్కి పంపించారు. అదే బిర్యానీని బెంజ్​కారులో తీసుకువస్తే రాజమర్యాదలు చేసి లోపలికి అనుమతించారు. అసలు ఏం జరిగిందంటే?

Bakrid Special Biryani
Bakrid Special Biryani
author img

By

Published : Jun 30, 2023, 7:34 AM IST

Bakrid Special Biryani : బక్రీద్​ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో ఆసక్తికర ఘటన జరిగింది. బక్రీద్​ పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధరామయ్యకు స్పెషల్​ బిర్యానీ పంపారు మంత్రి జమీర్ అహ్మద్​ ఖాన్​. బిర్యానీ పార్సిల్​ను ఆటోలో తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. అనంతరం బెంజ్ కారులో తీసుకువస్తే.. రాజమర్యాదలు చేసి ముఖ్యమంత్రి నివాసంలోకి అనుమతించారు.

ఇదీ జరిగింది.. గురువారం బెంగళూరులో మైసూరు రోడ్డులోని ఈద్గా దర్గాలో బక్రీద్​ వేడుకల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడం వల్ల.. శివానంద సర్కిల్​ ఉన్న తన అధికారిక నివాసానికి వెళ్లారు. అయితే, బక్రీద్​ పర్వదినాన్ని పురస్కరించుకుని.. సిద్ధరామయ్యకు సన్నిహితుడు, మంత్రి జమీర్ అహ్మద్​​.. స్పెషల్​ బిర్యానీ తయారు చేయించారు. ఆ బిర్యానీని ప్యాకింగ్ ​చేసి ఆటోలో సిద్ధరామయ్య ఇంటికి పంపించారు. అయితే, ఆటోను అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. సీఎం ఇంటిలోపలికి అనుమతించలేదు. చేసేదేం లేక ఆటో చామరాజ్​పేట​లోని మంత్రి జమీర్​ ఇంటికి వెళ్లింది.

ఈ విషయం తెలుసుకున్న జమీర్​.. సిద్ధరామయ్య నాన్​వెజ్ ప్రియుడు కాబట్టి ఆయన కోసం స్పెషల్​గా తయారుచేసిన బిర్యానీ వృథా కాకూడదని అనుకున్నారు. ఎలాగైనా బిర్యానీని ముఖ్యమంత్రికి అందించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఉపాయం ఆలోచించి.. బెంజ్​ కారులో బిర్యానీ పార్సిల్​ను మళ్లీ ముఖ్యమంత్రి ఇంటికి పంపించారు. ఈసారి బెంజ్​ కారును చూసిన పోలీసులు.. రాజమర్యాదలు చేసి లోపలికి అనుమతించారు. జమీర్​ పట్టు పట్టి మరీ లంచ్​ సమయంలోపే బక్రీద్​ స్పెషల్​ బిర్యానీని సిద్ధరామయ్యకు అందజేశారు. ఆ బిర్యానీతో లంచ్​ ముగించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

క్యాండిల్​ వెలుగులో బడ్జెట్ చిదివిన సిద్ధరామయ్య​..
ఇలాంటి ఓ ఘటనతో ఇటీవల వార్తల్లో నిలిచారు సిద్ధరామయ్య. కర్ణాటక విధానసభలో అశుభకరమైనదిగా భావించే దక్షిణ భాగంలో ఉన్న తలుపును చాలా ఏళ్ల తర్వాత తెరిపించారు. ఆ తలుపు నుంచే రాకపోకలు సాగించాలని నిర్ణయించారు. 'అన్న భాగ్య పథకం' గురించి సీనియర్​ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమైన సీఎం.. మూసి ఉన్న తలుపును గమనించి ఆరాతీశారు. ఆ ద్వారాన్ని అశుభకరమైనదిగా భావిస్తున్నారని.. అందుకే తెరవడం లేదని అధికారులు తెలిపారు. అనంతరం ఆ తలుపులు ముందు కొద్ది సేపు నిల్చున్న సిద్ధరామయ్య.. దాన్ని తెరవమని అధికారులను అదేశించారు.

అయితే అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. గతంలో ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. శాసనసభలో అశుభ రాహు కాలంలో బడ్జెట్​ ప్రవేశపెట్టారు. దీంతో అసెంబ్లీలో కరెంట్​ పోయింది. సభ్యులందరూ కంగారు పడినా.. క్యాండిల్​ వెలుగులో ఆయన బడ్జెట్​ చదివారు. కరెంట్​ వచ్చే వరకు అలాగే చదవడం కొనసాగించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.