MIM Party Will Win Again at Old city in Telangana : పాతబస్తీలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్న ఎంఐఎం(MIM)ను.. నాంపల్లి, యాకుత్‌పుర నియోజకవర్గాలు కలవర పెడుతున్నాయి. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గట్టి పోటీ ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మెరాజ్ హుస్సేన్‌పై వ్యతిరేకత రావడంతో.. ఆయన్ని యాకుత్‌పురకు మార్చారు. అయితే అక్కడ కూడా మజ్లిస్‌కు తీవ్ర పోటీ(Congress vs MIM) ఎదురవుతోంది. మజ్లిస్ బచావో తెహ్రిక్-ఎంబీటీ నుంచి అంజదుల్లా ఖాన్ హోరాహోరీ తలపడుతున్నారు.
Asaduddin Fires on Revanth Reddy : స్థానికుడైన తనను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. చార్మినార్‌లోనూ గట్టి పోటీ ఉండటంతో.. అసదుద్దీన్, అక్బరుద్దీన్ రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, పీసీసీ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఓవైసీ సోదరులు విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు ఆర్‌ఎస్‌ఎస్(RSS)తో సంబంధాలు అంటగట్టడంపై అసదుద్దీన్ మండిపడ్డారు.
"ఆర్‌ఎస్‌ఎస్ చెడ్డీ వేసుకుని మీ జీవితం మొదలైంది. ఆ తర్వాత ఏబీవీపీకి వెళ్లారు. అక్కడి నుంచి తెలుగుదేశానికి వెళ్లి.. ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. మోహన్ భగవత్ గాంధీభవన్‌ను కబ్జా చేశారు. మోహన్ భగవత్ ఎలా కావాలంటే అలా కాంగ్రెస్ నడుచుకుంటోంది. తెలంగాణలో మీరే దొరల రాజకీయం చేస్తున్నారు రెడ్డి గారు. దొరలంటే మీరే. మోహన్ భగవత్ మిమ్మల్ని నడిపిస్తున్నారు. మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు." - అసదుద్దీన్ ఓవైసీ, మజ్లిస్ అధినేత
6 స్థానాలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ
ఆర్‌ఎస్‌ఎస్ టిల్లు రేవంత్ రెడ్డి : గోషామహల్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించడంపై అక్బరుద్దీన్(Akbaruddin Owaisi) వ్యంగ్యాస్రాలు సంధించారు. ఆర్‌ఎస్‌ఎస్ టిల్లు అంటూ రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ఏడు సిట్టింగ్ స్థానాల్లో ఒక్కటి కూడా చేజారకుండా చూసుకోవాలనే పట్టుదలతో పతంగి పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఏడు సిట్టింగ్ స్థానాల్లో ఒక్కటి కూడా చేజారకుండా చూసుకోవాలనే పట్టుదలతో పతంగి పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
"వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేస్తున్నారు..? మిగతా చోట్ల ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మేము బలహీనంగా ఉన్నాం. ఆర్‌ఎస్‌ఎస్ టిల్లు ఎవరో తెలుసా..? ఆర్‌ఎస్‌ఎస్ టిల్లు అని ( రేవంత్‌కు) పేరు పెడుతున్నా. ఆర్‌ఎస్‌ఎస్ టిల్లు... నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ మనిషివి. నువ్వే గోషామహల్‌లో పోటీపడు. విజయం సాధించి చూపించు." - అక్బరుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యే
ఆచితూచి అడుగులు వేస్తున్న మజ్లిస్ పార్టీ - కంచుకోట పాతబస్తీపై పట్టు కొనసాగించేనా?