ETV Bharat / bharat

'2050కల్లా 4.5కోట్ల మంది భారతీయుల వలస'

భారత్​లో 2050కల్లా 4.5 కోట్ల మందికి పైగా బలవంతంగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఓ నివేదిక వెల్లడించింది. వాతావరణ విపత్తులతో 2020లో ఇప్పటికే భారత్‌లో 1.4 కోట్ల మంది తాము ఉన్న ప్రాంతాల నుంచి తరలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదిక తెలిపింది. యాక్షన్‌ ఎయిడ్‌ ఇంటర్నేషనల్‌, క్లైమేట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ సౌత్‌ ఆసియా కలిపి ఈ నివేదికను రూపొందించాయి.

migrant population in india will rise to 4.5 crore by 2050
'2050కల్లా 4.5 కోట్ల భారతీయుల వలస'
author img

By

Published : Dec 19, 2020, 7:55 AM IST

వరదలు, తుఫాన్లు, కరవు కాటకాలు తదితర వాతావరణ విపత్తులతో భారత్‌లో 2050కల్లా 4.5 కోట్ల మందికి పైగా బలవంతంగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఓ నివేదిక హెచ్చరించింది. యాక్షన్‌ ఎయిడ్‌ ఇంటర్నేషనల్‌, క్లైమేట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ సౌత్‌ ఆసియా కలిపి ఈ నివేదికను రూపొందించాయి.

ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలన్న పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని అమలు చేయడంలో రాజకీయ నాయకత్వం వైఫల్యం కారణంగానే ఈ అనర్థం తలెత్తనుందని నివేదిక తెలిపింది. వాతావరణ విపత్తులతో 2020లో ఇప్పటికే భారత్‌లో 1.4 కోట్ల మంది తాము ఉన్న ప్రాంతాల నుంచి తరలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య 2050కి మూడు రెట్లు కానుందని నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి : అందరికీ పోషకాలు అందేదెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.