వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం కుప్పకూలగా... ఒక పైలట్ మృతి చెందారు.
మధ్య భారతంలోని ఓ శిక్షణా శిబిరం నుంచి ఉదయం టేక్ ఆఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వాయుసేన తెలిపింది. ఈ ఘటనలో గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా చనిపోయారని వెల్లడించింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిన వాయుసేన... పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.