ETV Bharat / bharat

స్నేహితుడితో గొడవ.. కిడ్నాప్ చేసి మర్డర్​.. శరీరాన్ని కాల్చి బూడిదను నదిలో.. - ఆవు దూడపై రేప్

స్నేహితుడిని కిడ్నాప్​ చేసి హత్య చేశారు ముగ్గురు వ్యక్తులు. అనంతరం శరీరాన్ని కాల్చి బూడిదను నదిలో పారబోశారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జరిగింది. మరోవైపు.. 15 ఏళ్ల మైనర్​ను అపహరించి సామూహిక అత్యాచారానకి పాల్పడ్డారు ఆరుగురు కామాంధులు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

friend killed in minor dispute
friend killed in minor dispute
author img

By

Published : Mar 6, 2023, 10:40 PM IST

మహారాష్ట్ర​ సాంగ్లీ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. స్నేహితుడిని కిడ్నాప్​ చేసి హత్య చేశారు ముగ్గురు వ్యక్తులు. అనంతరం శరీరాన్ని కాల్చి.. బూడిదను నదిలో పారబోశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఓ చిన్న గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సాంగ్లీ జిల్లాలోని వాల్వా తాలుకాకు చెందిన ఓంకార్​.. అష్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, ఓంకార్​కు తన స్నేహితుడు సమ్మద్​తో చిన్న గొడవ జరిగింది. దీంతో కోపం పెంచుకున్న సమ్మద్​.. ఓంకార్​ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. ఫిబ్రవరి 27న మరికొందరు స్నేహితులతో వచ్చి ఓంకార్​ను కిడ్నాప్ చేశాడు సమ్మద్. అనంతరం ఓంకార్​ను హత్య చేశారు. శరీరాన్ని కాల్చి బూడిదను నదిలో పారబోశారు. ఓంకార్​ స్నేహితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భరత్​, రాకేశ్​, సమ్మద్​ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓంకార్​తో చిన్న వివాదం కారణంగానే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.

15 ఏళ్ల మైనర్​ను కిడ్నాప్ చేసి రేప్​
ఉత్తర్​ప్రదేశ్​ అమ్రోహాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల మైనర్​ను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు కామాంధులు. నిందితుల చెర నుంచి బయటపడిన బాలిక కుటుంబ సభ్యులకు తనపై జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు.. ఆరుగురు నిందితులపై డిడోలి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి గాలిస్తున్నట్లు తెలిపారు.

మద్యం తాగొద్దనందుకు భార్యకు నిప్పు
ఉత్తర్​ప్రదేశ్ నొయిడాలో ఘోరం జరిగింది. భార్యపై కిరోసిన్​ పోసి నిప్పంటించాడు ఓ భర్త. తీవ్ర గాయాలపాలైన భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యద్వేంద్ర యాదవ్​ అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం వినీత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే యద్వేంద్ర రోజు తాగి వచ్చి వినీతతో గొడవ పెట్టుకునేవాడు. మార్చి 2 రాత్రి కూడా మద్యం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన యద్వేంద్ర.. వినీతపై కిరోసిన్​ పోసి నిప్పటించాడు.

దూడపై అత్యాచారం
రెండున్నరేళ్ల ఆవు దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని రెవా జిల్లాలో జరిగింది. ఓ ఇంటి వెనుక భాగంలో ఉన్న దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన యజమాని.. అక్కడికి రావడం వల్ల నిందితుడు పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.