మహారాష్ట్ర సతారాలో విషాదకర ఘటన జరిగింది. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని ఏడాదిన్నర చిన్నారి మరణించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సతారాలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారికి ఇంటి పక్కన ఉండేవారు చాక్లెట్ కొని ఇచ్చారు. ఆమె చాక్లెట్ నోట్లో వేసుకోగా గొంతులోనే ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస ఆడక అపస్మారక స్థితిలోకి చేరింది. దీనిని గమనించిన చిన్నారి తల్లి.. హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలిచింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
విషవాయువు పీల్చి గర్భస్థ శిశువు మృతి
ఉత్తరాఖండ్ నైనితాల్‌లో విషాదం జరిగింది. విషవాయువు పీల్చి ఓ గర్భస్థ శిశువు మృతి చెందింది. చలి ఎక్కువగా ఉండడం వల్ల దంపతులిద్దరూ రాత్రి గదిలో చలిమంట వేసుకుని పడుకున్నారు. కాసేపటికే పొగను పీల్చుకుని అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
వీరిని గమనించిన స్థానికులు.. దంపతులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. మహిళ కడుపులో ఉన్న 8 నెలల శిశువు మరణించింది. శిశువు విష వాయువులు పీల్చడమే మృతికి కారణమని వైద్యులు తెలిపారు. మహిళ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని పేర్కొన్నారు. కాగా మహిళ భర్త కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బొగ్గును కాల్చినపుడు అది కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తుందని.. దీనిని ఎక్కువగా పీల్చడం వల్ల మరణించే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు.
ఇవీ చదవండి: కంచె దూకి మరీ వ్యాన్‌పై దాడి చేసిన చిరుత
కన్నతల్లిపై కొడుకు అత్యాచారం.. చంపేస్తానని బెదిరింపులు.. అడ్డొచ్చిన తండ్రిని..