ETV Bharat / bharat

512 కిలోల ఉల్లి అమ్మిన రైతుకు మిగిలింది రూ.2 - మహారాష్ట్ర ఉల్లిరైతు న్యూస్

గిట్టుబాటు ధర దక్కక రైతులు అల్లాడుతున్నారనేందుకు మరో సాక్ష్యంగా నిలుస్తోంది మహారాష్ట్రలో జరిగిన తాజా ఘటన. 512 కేజీల ఉల్లిపాయలను విక్రయించిన ఓ రైతు చేతిలో చివరకు రూ.2 మాత్రమే మిగిలాయి. వచ్చిన రాబడి పూర్తిగా.. రవాణా, ఇతర ఖర్చులకే వెళ్లిపోయింది.

farmer get only 2 rs
farmer get only 2 rs
author img

By

Published : Feb 23, 2023, 2:54 PM IST

మహారాష్ట్ర సోలాపుర్​​లో ఓ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. ఎంతో కష్టపడి పండించిన పంటను విక్రయియంచిన ఆ వ్యక్తికి కనీసం టీ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. సోలాపుర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 512 కిలోల ఉల్లిపాయలను విక్రయించిన రైతు.. రూ.2 మాత్రమే సంపాదించారు. ఇందుకు సంబంధించిన రసీదు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

రాజేంద్ర చవాన్ అనే రైతు​.. ఫిబ్రవరి 17న 10 బస్తాల ఉల్లిపాయలతో మార్కెట్​కు వచ్చాడు. వీటిని తూకానికి పెట్టగా మొత్తం 512 కిలోలు అని తేలింది. అయితే ఉల్లిపాయల ధరలు పడిపోవడం వల్ల కిలోకు రూ. 1 చొప్పున కొంటామని కొనుగోలుదారులు చెప్పారు. మొత్తం ఉల్లిపాయలకు రూ. 512 చెల్లించారు. అయితే పంటను పొలం నుంచి తీసుకొచ్చేందుకు అయిన రవాణా ఖర్చు, కూలీల ఖర్చు, మార్కెట్​కు సంబంధించిన ఇతర వ్యయాలన్నీ కలిపి రూ.509.51 అయ్యాయి. అంటే మిగిలింది రూ.2.49. దాన్ని కూడా రౌండ్ ఫిగర్ చేసిన అధికారులు.. రైతుకు రూ. 2 మాత్రమే వస్తాయని లెక్కగట్టారు. రూ.2 చెక్కును రాజేంద్రకు అందజేశారు వ్యవసాయ మార్కెట్​ కమిటీ అధికారులు.

farmer get only 2 rs
రసీదును చూపిస్తున్న రైతు
farmer get only 2 rs
రసీదును చూపిస్తున్న రైతు

ఈ వ్యవహారంపై అనేక రైతుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 10 బస్తాల ఉల్లిపాయలు విక్రయిస్తే రూ. 2 చెక్​ ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డాయి. ఇలా అయితే రైతులు ఎలా బతకాలని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయని, విద్యుత్ సరఫరా సరిగా లేక తాము అనేక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

farmer get only 2 rs
చెక్కును చూపిస్తున్న రైతు

మార్కెట్​కు పెద్ద ఎత్తున ఉల్లిపాయలు రావడం వల్లే ధర తగ్గిపోయిందని వ్యాపారులు తెలిపారు. మార్కెట్​లోకి అనేక రకాల ఉల్లిపాయలు వస్తాయని.. నాణ్యత కలిగినవి మంచి ధరకే అమ్ముడవుతున్నాయని చెప్పారు. ఫిబ్రవరి 17 న కూడా నాణ్యమైన ఉల్లిపాయలు అత్యధిక ధరను పొందాయని పేర్కొన్నారు.
అంతకుముందు కర్ణాటకలో ఇలాంటి ఘటన జరిగింది. 205 కిలోల ఉల్లిపాయలు అమ్మిన రైతుకు.. చివరకు రూ.8 ఇచ్చారు వ్యవసాయ మార్కెట్ అధికారులు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి : రూపాయి చిల్లర లేదన్న కండక్టర్​.. ప్రయాణికుడి మూడేళ్ల పోరాటం.. ఆర్టీసీకి రూ.3వేలు ఫైన్​

పన్నీరు​సెల్వంకు షాక్​.. పళనిస్వామి ఎన్నికను సమర్థించిన సుప్రీం.. కార్యకర్తలు సంబరాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.