MGM Maran Assets Seize: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ నేసమణిమారన్ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్ ఆస్తులను జప్తు చేసింది ఈడీ. ఫెమా చట్టం, 1999 కింద మారన్‌కు చెందిన రూ.293.91 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆస్తులు.. భారతీయ కంపెనీలైన సదరన్ అగ్రిఫ్యూరేన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజీఎమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజీఎం డైమండ్ బీచ్ రీసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్ల రూపంలో ఉన్నాయన్నారు.
మారన్ 2005-06, 2006-07 ఆర్థిక సంవత్సరంలో సింగపుర్లోని రెండు సంస్థల్లో రూ. 293.91 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ పేర్కొంది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ పెట్టుబడులు పెట్టినట్లు వివరించింది.
ఇదీ చూడండి: పూలతో ప్రపంచ రికార్డులు.. 7గంటల్లో 108 ఫ్లవర్ బ్యాండ్స్ తయారీ