ETV Bharat / bharat

అనారోగ్యంతో కుమారుడు మృతి.. కోడలికి రెండో పెళ్లి చేసిన మాజీ ఎంపీ! - కోడలుకు రెండో పెళ్లి ధమ్​తరీ న్యూస్​

ఓ మాజీ ఎంపీ వితంతువైన తన కోడలి విషయంలో.. తండ్రిలా ఆలోచించి ఓ పని చేశారు. తన కొడుకు చనిపోగా కోడలికి రెండో పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. అది ఎక్కడ ఏంటో తెలుసుకుందామా మరి!

dhamtari-former-mp-chandulal-sahu-remarried-his-widowed-daughter-in-law-dhamtari-latest-news
కోడలికి రెండో పెళ్లి చేసిన మాజీ ఎంపీ
author img

By

Published : Nov 7, 2022, 10:09 AM IST

Updated : Nov 7, 2022, 11:59 AM IST

ఛత్తీస్​గఢ్​లో ఓ మాజీ ఎంపీ వితంతువైన తన కోడలికి కొత్త జీవితాన్ని అందించారు. అనారోగ్యంతో తన కొడుకు చనిపోగా ఒంటరి జీవనం సాగిస్తున్న తన కోడలికి.. తండ్రి స్థానంలో ఉండి మరో వ్యక్తితో వివాహం జరిపించి మెట్టినింటికి సాగనంపారు. ధమ్​తరీకి చెందిన మాజీ ఎంపీ చందూలాల్​ సాహు చేసిన ఈ మంచిపనిని అనేక మంది అభినందిస్తున్నారు.

dhamtari-former-mp
రెండో పెళ్లి చేసుకున్న దంపతులు
dhamtari-former-mp
పెళ్లి పీటలపై కొత్త జంట

ధమ్​తరీలోని మహాసముంద్ మాజీ ఎంపీ చందూలాల్ సాహు కుమారుడికి, కల్యాణి సాహు అనే అమ్మాయికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన నాలుగేళ్లకే.. చందూలాల్ కొడుకు అనారోగ్యంతో మరణించాడు. దీంతో.. కల్యాణి ఏడాదిన్నర వయసున్న కుమారుడితో ఒంటరిగా మారింది. అప్పటి నుంచి తన మామ చందూలాల్​ సాహు.. కోడలికి రెండో వివాహం చేయడానికి తగిన వరుడి కోసం వెతికారు. అయితే.. ధమ్​తరీకి చెందిన డాక్టర్​ వీరేంద్ర గంజీర్​ గురించి తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో పెళ్లి కాగా భార్య గుండెపోటుతో మరణించింది. అప్పటి నుంచి వీరేంద్ర తన కుమారైతో ఒంటరిగా జీవిస్తున్నాడు. వారిద్దరి అసంపూర్ణ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇద్దరి కుటుంబ సభ్యులు చర్చలు జరిపి వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. ధమ్​తరీలోని వింధ్యవాసిని ఆలయంలో అందరి సమక్షంలో వేద మంత్రాలతో ఒక్కటయ్యారు. ఇక నుంచీ తమ కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుతామని.. తమ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ లభిస్తుందని ఆ దంపతులు అన్నారు.

Last Updated : Nov 7, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.