ETV Bharat / bharat

'మిస్త్రీ యాక్సిడెంట్​కు 5 సెకన్ల ముందు అలా..'.. బెంజ్ కంపెనీ కీలక నివేదిక - సైరస్ మిస్త్రీ మృతి కారణం

దిగ్గజ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదానికి ముందు ఏం జరిగింది? అప్పుడు కారు ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? బ్రేకులు పనిచేశాయా? ఆ దుర్ఘటనకు అసలు కారణాలేంటి? అనే ప్రశ్నలకు జవాబులు సహా మరికొన్ని ఆసక్తికర విషయాలతో కీలక నివేదిక రూపొందించింది ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్. అందులో ఏముందంటే...

cyrus mistry accident
'మిస్త్రీ యాక్సిడెంట్​కు 5 సెకన్ల ముందు అలా..'.. బెంజ్ కంపెనీ కీలక నివేదిక
author img

By

Published : Sep 9, 2022, 4:26 PM IST

Cyrus Mistry death reason : టాటా సన్స్​ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త​ సైరస్​ మిస్త్రీ(54) కారు ప్రమాదంపై కీలక నివేదిక రూపొందించింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్. మహారాష్ట్ర పాల్ఘర్​ పోలీసులకు అందజేసిన ఈ మధ్యంతర నివేదికలో.. దుర్ఘటనకు ముందు పరిస్థితుల్ని వివరించింది. కారులోని ఎలక్ట్రానిక్​ కంట్రోల్​ మాడ్యూల్​ను విశ్లేషించి ఈ విషయాలు తెలుసుకున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ సంస్థ తెలిపింది.

బెంజ్ కంపెనీ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు:

  • ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
  • డివైడర్​ను ఢీకొట్టడానికి కచ్చితంగా ఐదు సెకన్ల ముందు బ్రేకులు వేశారు.
  • సూర్యా నది వంతెనపై ఉన్న డివైడర్​ను ఢీకొట్టే సమయంలో కారు వేగం గంటకు 89 కిలోమీటర్లు.
  • క్రాష్ జరిగిన వెంటనే కారులోని నాలుగు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. ఇందులో మూడు డ్రైవర్ సీట్ వద్ద ఉండగా, మరొకటి పక్కన ఉంది.

ప్రమాదానికి గురైన కారు.. ప్రస్తుతం ఠాణే హీరానందనిలో తమ షోరూమ్​లో ఉన్నట్లు మెర్సిడెజ్ బెంజ్​ ప్రతినిధులు తెలిపారు. అందులోని ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్(ఈసీఎం)ను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు వివరించారు. దర్యాప్తులో పోలీసులు, సంబంధిత అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 12న హాంగ్​కాంగ్​ నుంచి నిపుణుల వచ్చి, ప్రమాదానికి గురైన కారును క్షుణ్నంగా పరిశీలిస్తారని బెంజ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులకు సమగ్ర నివేదిక అందజేస్తామని చెప్పారు.

ఏంటీ ఈసీఎం?
మెర్సిడెజ్ బెంజ్ వంటి హైఎండ్ కార్లలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్​ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? బ్రేక్ ఫ్లూయిడ్ సరిపడా లేదా? వంటి సాంకేతిక అంశాలను తెలుసుకునేందుకు ఈసీఎంలోని సమాచారం ఉపయోగపడుతుంది. సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారులోని ఈసీఎంను బెంజ్ ప్రతినిధులు విశ్లేషించి, ఆ వివరాలను పోలీసులకు అందజేశారు.

Cyrus Mistry death news : సైరస్‌ మిస్త్రీ, ప్రముఖ గైనకాలజిస్టు అనాహితా పండోల్‌, ఆమె భర్త డేరియస్‌ పండోల్‌, ఆయన సోదరుడు జహంగీర్‌ పండోల్‌ ఆదివారం కారులో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వస్తుండగా పాల్ఘర్​ జిల్లాలో ప్రమాదం జరిగింది. అప్పుడు కారును అనాహితా నడుపుతున్నారు. ఈ ఘటనలో సైరస్, జహంగీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.