ETV Bharat / bharat

మేఘాలయ సీఎంగా కాన్రాడ్​ సంగ్మా ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ - మేఘాలయ తాజా వార్తలు

మేఘాలయ నూతన సీఎంగా కాన్రాడ్​ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరయ్యారు.

Meghalaya New CM Conrad Sangma
మేఘాలయ కొత్త సీఎంగా కాన్రాడ్​ సంగ్మా
author img

By

Published : Mar 7, 2023, 11:33 AM IST

Updated : Mar 7, 2023, 1:02 PM IST

మేఘాలయ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్​ సంగ్మా మంగళవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. రాజధాని షిల్లాంగ్​లోని రాజ్​భవన్​లో ఈ ప్రమాణ స్వీకార వేడుక జరిగింది. గవర్నర్​ ఫాగు చౌహాన్​ ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నుంచి అలెగ్జాండర్ లలూ హెక్​ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

గతనెల 27న మేఘాలయలో జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్​పీపీ 26 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో నాలుగు సీట్ల అవసరం కాగా బీజేపీ, యూడీపీ, హెచ్​ఎస్​పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సంగ్మా మంత్రివర్గంలో ఎన్‌పీపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలైన యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్​ఎస్​పీడీపీ నుంచి చెరో ఎమ్మెల్యే ​సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా ప్రమాణం చేశారు.

ఎన్‌పీపీకి చెందిన ప్రెస్టోన్ టైన్సాంగ్, స్నియావ్‌భాలంగ్ ధార్ ఎమ్మెల్యేలిద్దరూ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. మార్కుస్ ఎన్ మారక్, రాక్కం ఎ సంగ్మా, అంపరీన్ లింగ్డో, రాబోన్ వైంబన్, ఏటి మొండల్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి ఎ ఎల్ హెక్, యూడీపీ నుంచి పాల్ లింగ్డో, కైర్మెన్ షల్లా, అలాగే హెచ్‌ఎస్‌పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్​లో జరిగే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు మోదీ. అనంతరం అసోంలో నిర్వహించే కేబినెట్​ సమావేశానికి హాజరవుతారు. అంతకుముందు దిల్లీ నుంచి గువాహటికి చేరుకున్న మోదీ అసోం గవర్నర్​ చంద్​ కటారియా, ఆ రాష్ట్ర సీనియర్​ కేబినెట్​ మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో కలిసి సోమవారం మేఘాలయ​కు​ చేరుకున్నారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య పర్యటన మంగళవారం ప్రారంభమైంది.

మార్చి 8న నాగాలాండ్​లో ముఖ్యమంత్రి నీఫు రియో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు మోదీ. అనంతరం త్రిపురలో ముఖ్యమంత్రి మానిక్ సాహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా వెళ్తారు. ఇందుకోసం ఆయన బుధవారం అగర్తాలాకు బయలుదేరతారు.

Last Updated : Mar 7, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.