ETV Bharat / bharat

తండ్రి బాటలోనే స్టాలిన్.. ప్లాస్టిక్​కు చెక్​ పెడుతూ మరో నిర్ణయం!

Meendum Manjapai: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వినూత్న నిర్ణయాలతో తండ్రి కరుణానిధి బాటలోనే నడుస్తున్నారు. రాష్ట్రంలో తిరిగి పసుపు సంచుల వాడకాన్ని ప్రోత్సహించేలా మీండుం మంజప్పై (తిరిగి పసుపు సంచులు) ప్రచారాన్ని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.

MK Stalin
ఎంకే స్టాలిన్
author img

By

Published : Dec 24, 2021, 5:17 AM IST

Meendum Manjapai: అనేక వినూత్న నిర్ణయాలతో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి బాటలో నడుస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరో పాత సంస్కృతికి ఊపిరూదారు. ముఖ్యంగా తన తండ్రి గతంలో చేపట్టినవి, చేపట్టాలని కలలు కన్న అంశాలను ఆచరణలో పెడుతున్నారు. ఈ క్రమంలో గత స్మృతుల్లోకి తీసుకెళుతూ రాష్ట్రంలో తిరిగి పసుపు సంచుల వాడకాన్ని ప్రోత్సహించేలా మీండుం మంజప్పై (తిరిగి పసుపు సంచులు) ప్రచారాన్ని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.

పర్యావరణం, సహజ వనరులకు కోలుకోలేని నష్టాన్ని కల్గించే హాని కలిగించే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకానికి చరమగీతం పాడటమే ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ పసుపు సంచులు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. పర్యావరణానికి కలిగించే హానికారకాలు మానవాళిని మళ్లీ పాతాళంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. పర్యావరణాన్ని కాపాడేవారి చిహ్నం ఇకపై పసుపు సంచిగా అభివర్ణించారు. పసుపు సంచులు పర్యావరణానికి సరైనవని, అందమైన ప్లాస్టిక్‌ సంచులు పర్యావరణానికి హానికల్గిస్తాయని స్టాలిన్‌ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు పసుపు సంచులు అందించారు.

MK Stalin
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో నిర్ణయం

Pollution Free Cloth Bag TN:

ఆ విషయంలో ముందుండాలి..

ప్లాస్టిక్‌ వస్తువులను ఉపయోగించడం ద్వారా కలిగే నష్టాలను స్టాలిన్‌ ప్రస్తావించారు. అన్ని రంగాల్లో మార్గదర్శక రాష్ట్రంగా నిలుస్తున్న తమిళనాడు పర్యావరణాన్ని కాపాడటంలోనూ ముందుండాలన్నారు. ప్రకృతిని కాపాడాలని ప్రకృతితో కలసి పయనించాలని పర్యావరణానికి విఘాతం కల్గించే ప్లాస్టిక్‌కు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. పసుపుసంచి తీసుకెళ్లడం ఎవరూ అవమానకరంగా భావించాల్సిన అవసరం లేదని, పర్యావరణాన్ని కాపాడేవారి చిహ్నమే పసుపుసంచి అని పేర్కొన్నారు.ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్‌ను అంతం చేసేందుకు ప్రజావిప్లవం రావాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది.ఈనేపథ్యంలో పసుపుసంచి ఉపయోగం గురించి అవగాహన కల్పించేందుకు మీండుం మంజప్పైని సీఎం ప్రారంభించడం గమనార్హం.

ఇదీ చదవండి:

మహమ్మారిపై యుద్ధం ఇంకా ముగియలేదు: మోదీ

'మతమార్పిడి వ్యతిరేక బిల్లు'కు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.