ETV Bharat / bharat

'శెభాష్ అథ్లెట్లు​.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది' - ఒలింపిక్స్​ ముగింపుపై మోదీ

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించి దేశాన్ని గర్వించేలా చేశారని భారత అథ్లెట్లను కొనియాడారు ప్రధాని నరేంద్ర మోదీ. విజయవంతంగా క్రీడలను నిర్వహించిన జపాన్​ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

pm modi, tokyo olympics 2020
ప్రధాని మోదీ, టోక్యో ఒలింపిక్స్ 2020
author img

By

Published : Aug 8, 2021, 8:09 PM IST

విజయవంతంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్​పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత అథ్లెట్లు సాధించిన పతకాలు దేశాన్ని గర్వించేలా చేశాయని కొనియాడారు. విశ్వక్రీడలను విజయవంతంగా నిర్వహించిన జపాన్ ప్రభుత్వాన్ని పీఎం మెచ్చుకున్నారు.

భారత క్రీడా వ్యవస్థను అట్టడుగు స్థాయిలో మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. కొత్త ప్రతిభావంతులు పుట్టుకొచ్చేలా కృషి చేయాలని తెలిపారు.

Medals India won in Olympics made nation proud, elated: PM Modi
ప్రధాని ట్వీట్​

భారత అథ్లెట్లను కీర్తిస్తూ..

మోదీ ట్వీట్​

తాజా ఒలింపిక్స్​లో భారత్​ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. 2012 లండన్​ ఒలింపిక్స్​లో భారత్​కు ఆరు పతకాలు రాగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను అధిగమించింది.

"ఒలింపిక్స్​లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత బృందానికి అభినందనలు. ఒక బృందంగా అంకితభావంతో వారి నైపుణ్యాలను కనబరిచారు. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి అథ్లెట్​ ఒక ఛాంపియన్​తో సమానం. విశ్వక్రీడలను విజయవంతంగా నిర్వహించిన జపాన్ ప్రభుత్వానికి, సహకరించిన అక్కడి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ క్రీడలను నిర్వహించి బలమైన సందేశాన్ని చాటారు."

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని.

ఇదీ చదవండి: Olympics: పతకాల పట్టికలో మళ్లీ అమెరికానే టాప్​.. భారత్​ ఎక్కడ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.