ETV Bharat / bharat

మాజీ ఎమ్మెల్యేపై దాడి- వీడియో వైరల్​

యువతిపై వేధింపులకు పాల్పడ్డారన్న కారణంతో యూపీలో మాజీ ఎమ్మెల్యేపై యువతి బంధువులు దాడి చేశారు. కళాశాల గదితో పాటు, క్యాంపస్ ఆవరణలో ఆయనపై దాడికి పాల్పడ్డారు.

Maya Shankar Pathak, Former BJP MLA, Brutally Thrashed for Harassing College Student in Varanasi
మాజీ ఎమ్మెల్యేపై దాడి- వీడియో వైరల్​
author img

By

Published : Jan 10, 2021, 9:03 PM IST

కళాశాల విద్యార్థినిని వేధించారన్న ఆరోపణలతో ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు యువతి కుటుంబ సభ్యులు. కళాశాలలోకి వచ్చి ఎమ్మెల్యేను హెచ్చరించారు.

పాఠక్​పై దాడి వీడియో

ఇదీ జరిగింది..

భాజపా నేత మాయా శంకర్ పాఠక్​ వారణాసిలోని బలువా పహాడియా మార్గ్ వద్ద ఇంజినీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు. కళాశాలలో చదివే ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డారు పాఠక్.

విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కాలేజీకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తాను చేసిన తప్పుకు పాఠక్ క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ శాంతించని కుటుంబ సభ్యులు పరుష పదజాలంతో మాజీ ఎమ్మెల్యేను దూషించారు. మరికొందరు ఆయనపై దాడి చేశారు. అదే గదిలో ఉన్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీశారు. కళాశాల గదిలోనే కాకుండా, క్యాంపస్ ఆవరణలోనూ ఎమ్మెల్యేపై... యువతి బంధువులు దాడి చేశారు. కుర్చీలో కూర్చోబెట్టి చితకబాదారు. ఇప్పుడీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

బాధిత యువతితో పాటు మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి ఎవరూ స్టేషన్​కు రాలేదని పింద్రా సర్కిల్ అధికారి అభిషేక్ కుమార్ పాండే వెల్లడించారు. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చిర్​గావ్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా టికెట్​పై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పాఠక్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.