ETV Bharat / bharat

'121ఏళ్లలో రెండో అత్యధిక వర్షపాతం' - మే నెల ఐఎండీ వర్షపాతం అంచనా వార్తలు

గడచిన 121 సంవత్సరాల్లో మే నెలలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంతేగాక ఉష్ణోగ్రతలు సైతం అదుపులోనే ఉన్నట్లు తెలిపింది.

imd
ఐఎండీ
author img

By

Published : Jun 11, 2021, 6:55 AM IST

గత 121 ఏళ్లలో దేశవ్యాప్తంగా మే నెలలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక పేర్కొంది. ఈ నెలలో సంభవించిన రెండు తుఫానుల కారణంగా నమోదైన రికార్డు వర్షపాతం దీనికి కారణమని తెలిపింది. 1901 తరువాత దేశంలో సగటు ఉష్ణోగ్రత నాలుగోసారి అత్యల్పంగా(34.18 డిగ్రీల సెల్సియస్) ఈ మేలోనే నమోదైనట్లు పేర్కొంది.

"ఇప్పటివరకూ మే నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు గమనిస్తే.. 1917లో 32.68 డిగ్రీల సెల్సియస్, 1977లో 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ ఏడాది మే 29-30 తేదీల్లో వాయువ్య రాజస్థాన్ మాత్రమే గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది."

-ఐఎండీ నివేదిక

ఇక 2021 మేలో దేశవ్యాప్తంగా 107.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ పేర్కొంది. ఇది సాధారణం కన్నా 74 శాతం ఎక్కువని.. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు కనిపించలేదని నివేదిక తెలిపింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తౌక్టే'.. బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్' తుపానుల ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది.

ఇవీ చదవండి: 62 ఏళ్లలో.. ఈ జనవరి చాలా 'హాట్​'

దక్షిణ భారతంలో ఈసారి వేసవి వేడి తక్కువే!

ఈసారి సాధారణ వర్షపాతం: ఐఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.