Mathura road accident: ఉత్తర్‌ప్రదేశ్ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున దిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్‌ప్రెస్ వేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని మథురా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరంతా నోయిడాలో ఓ వివాహ వేడుకకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
![Mathura road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-mat-01-big-accident-at-yamuna-exspresway-vis-up10136_07052022063108_0705f_1651885268_632.jpg)
![Mathura road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-mat-01-big-accident-at-yamuna-exspresway-vis-up10136_07052022063108_0705f_1651885268_688.jpg)
అతివేగంతో.. : టవేరా.. ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఏడుగురు మృతి చెందారు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఉమ్రేద్ మార్గ్‌లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. టవేరా అతివేగంతో ప్రయాణించి ట్రక్కును ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 'పెళ్లికి తొందరెందుకు..? గర్భనిరోధక బాధ్యత మహిళలదే!'