ETV Bharat / bharat

శ్రీకృష్ణ జన్మస్థలంలో మసీదును తొలగించాలని పిటిషన్​.. కోర్టు ఏమందంటే? - శ్రీకృష్ణుడి జన్మస్థలం తీర్పు

Sri Krishna Birth Place: మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించడంపై రెండేళ్ల క్రితం దాఖలైన పిటిషన్‌ను జిల్లా కోర్టు గురువారం అనుమతించింది. కృష్ణుడి భక్తురాలు రంజనా అగ్నిహోత్రి 2020లో ఈ పిటిషన్​ను దాఖలు చేశారు.

Sri Krishna Birth Place
Sri Krishna Birth Place
author img

By

Published : May 19, 2022, 4:02 PM IST

Updated : May 19, 2022, 5:41 PM IST

Sri Krishna Birth Place: శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మథుర జిల్లా కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఇప్పుడు శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసు సీనియర్ డివిజన్ కోర్టులో నడుస్తుంది. కృష్ణుడి భక్తురాలు రంజనా అగ్నిహోత్రి రెండేళ్ల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత దీనిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్​ 13.37 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. అదే ప్రాంగణంలో మసీదు నిర్మించారని పిటిషన్​దారులు ఆరోపించారు.

లఖ్​నవూ నివాసి రంజనా.. న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. 2020 సెప్టెంబర్​ 25న శ్రీ కృష్ణ జన్మభూమి ప్రాంతంలో షాహీ ఈద్గా మసీదును తొలగించాలని మథుర సివిల్​ కోర్టులో ఆమె పిటిషన్​ దాఖలు చేయగా.. తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత 2020 సెప్టెంబర్ 30న రంజనా మరోసారి పిటిషన్​ దాఖలు చేశారు. అప్పుడు కూడా సివిల్​ కోర్టు తిరస్కరించింది. దీంతో పిటిషనర్లు మథుర జిల్లా కోర్టును ఆశ్రయించారు. షాహీ ఈద్గా మసీదును తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఈ కేసులో, శ్రీ కృష్ణ జన్మస్థల సేవా సంస్థాన్, హిందువుల తరఫున పిటిషనర్​ రంజనా, న్యాయవాది ముఖేష్ ఖండేల్వాల్ కేసును వాదిస్తున్నారు. మరోవైపు, షాహీ ఈద్గా మసీదు, యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు ముస్లింల పక్షాన న్యాయవాదులు తన్వీర్ అహ్మద్, నీరజ్ ఈ కేసుపై పోరాడుతున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జి రాజీవ్​ భారతి తీర్పును రిజర్వ్​ చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: జ్ఞాన్​వాపి సర్వేలో సంచలన నిజాలు.. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు!

జ్ఞాన్​వాపి కేసు.. మేము విచారణ జరిపే వరకు మీరు ఆగండి: సుప్రీంకోర్టు

Last Updated : May 19, 2022, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.