ఒకరికి జరిగిన నష్టం మరొకరికి లాభం చేకూరుస్తుందని అంటారు. ఇలాంటి సంఘటనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. కోళ్లతో వెళ్తున్న ఓ వాహనం బోల్తాపడగా.. వాటిని తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బేమెతరా- నవాగఢ్ రహదారిపై ఈ సంఘటన జరిగింది.
బేమెతరా నుంచి నవాగఢ్కు కోళ్లతో వెళ్తున్న ఓ ట్రక్కు.. అట్రియా గ్రామసరిహద్దులో అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. చిన్నాపెద్దా తేడాలేకుండా కోళ్లకోసం ఎగబడ్డారు. దొరికిన వారు దొరికినట్టుగా కోళ్లను తీసుకుని ఇళ్లకు వెళ్లారు.
అయితే.. బర్డ్ ఫ్లూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చికెన్ తిన్నవారు కాస్తా ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికైతే.. బేమెతరా జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఈ వాహన బోల్తా ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
ఇదీ చదవండి:తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయం