ETV Bharat / bharat

పాపం.. ప్రాణాలు తీసిన నకిలీ బ్యాంక్​ అకౌంట్!

Fake Bank Account: గుర్తుతెలియని వ్యక్తులు తెరచిన నకిలీ బ్యాంక్​ ఖాతా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అధికారులు తనపై చర్యలు తీసుకుంటారన్న భయంతో ఏ తప్పూ చేయకపోయినా.. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

uttarpradesh news latest
ఏ తప్పు చేయకున్నా భయంతో మేస్త్రీ ఆత్మహత్య!
author img

By

Published : Dec 31, 2021, 7:32 AM IST

Fake Bank Account: ఉత్తర్​ప్రదేశ్​లోని షాహ్​జహాన్​పుర్​లో జరిగిన ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏ తప్పూ చేయకపోయినా అధికారులు తనపై చర్యలు తీసుకుంటారేమో అన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది..

ఖుతర్ పట్టణానికి చెందిన రామషీష్​ (45) పేరు మీద యాక్సిస్​ బ్యాంకులో అతనికి తెలియకుండా కొన్నేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఖాతా తెరిచారు. ఆహారధాన్యాల ముఠాకు చెందిన వీరు.. గోధుమ, వరి కొనుగోలు కేంద్రాలతో రూ.లక్షల్లో లావాదేవీలు జరిపారు. వారికి అందాల్సిన సొమ్ము వచ్చాక.. ఆ ఖాతా నుంచి లావాదేవీలు చేయడం ఆపేశారు. 2015లో ప్రారంభమైన ఈ ఖాతా 2019 వరకు వినియోగంలో ఉంది. ఆ తర్వాత అకౌంట్​ నుంచి ఎలాంటి లావాదేవీలు​ జరగలేదు. ఇంత జరిగినా రామషీష్​కు వీటి గురించి తెలియలేదు.

ఈ లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేసిన బ్యాంకు అధికారులు రామషీష్​ ఇంటికి వచ్చి ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఖాతా తెరవలేదని మొరపెట్టుకున్నాడు. ఆ సమయంలో బ్యాంకు మేనేజర్​ రామషీష్​ ఫొటో తీసుకున్నాడని.. ఆధార్​కార్డ్​ చూపించమని డిమాండ్​ చేశాడని రామషీష్​ భార్య ప్రమీళా దేవీ ఆరోపించారు. మంగళవారం కూడా రామ్​షీష్​ను మార్కెట్​లో ఓ బ్యాంక్​ ఉద్యోగి ఈ విషయంపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె పేర్కొన్నారు. ఈ భయంతోనే బుధవారం అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరు పెట్టుకుంది.

ఇదీ చూడండి : మెట్ల నుంచి 'పియానో' రాగాలు.. ఫిదా అవుతున్న ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.