మాస్క్ ధరించలేదని ఓ వ్యక్తిని నడిరోడ్డుపై ఇద్దరు పోలీసులు దారుణంగా కొట్టారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరంలో జరిగిందీ ఘటన. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో.. వైరల్గా మారింది.
ప్రాధేయపడినా..
పోలీసులు కొడుతుండగా.. ఆ వ్యక్తి కుమారుడు సహా మరో మహిళ వారిని ప్రాధేయపడుతుండటం వీడియోలో కనిపించింది. ఇద్దరి కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అశుతోష్ బాగ్రీ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించలేదని.. బాధితుడ్ని పోలీసులు ఆపి, వివరణ కోరారని బాగ్రీ తెలిపారు. దాంతో ఆ వ్యక్తి.. పోలీసుల కాలర్ పట్టుకుని, అసభ్యకరంగా మాట్లాడారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోను తప్పుగా ఎడిట్ చేసి విడుదల చేశారని ఆరోపించారు.
ఇదీ చూడండి:యూపీ పోలీసుల కస్టడీలో ముక్తార్ అన్సారీ