ETV Bharat / bharat

Maratha Reservation Protest : మరాఠాల రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకం.. శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు - maratha reservation violence maharashtra

Maratha Reservation Protest Today : మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ తీవ్రమవుతోంది. మరాఠాల డిమాండ్‌కు రాజకీయ నేతలతో పాటు పలు సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటివరకు 20కిపైగా బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు. మహారాష్ట్రలోని 250 బస్సు డిపోలలో 45 డిపోలను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పరిధిని ప్రస్తుతం ఉన్న 50 శాతానికి అదనంగా మరో 15 నుంచి 16 శాతం పెంచాలని శరద్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు.

maratha-reservation-protest-today-in-maharashtra-and-sharad-power-on-maratha-reservation
మరాఠా రిజర్వేషన్ల నిరసనలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 7:50 PM IST

Maratha Reservation Protest Today : మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అహ్మదాబాద్‌, ఔరంగాబాద్‌, పర్భని, హింగోలి, జల్నా, నాందేడ్‌, ధారాశివ్‌ జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, బంద్‌లతో ఆయా జిల్లాలు అట్టుడుకుతున్నాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రభావిత ప్రాంతాల్లోని 46 బస్సు డిపోలను మూసివేశారు. మహారాష్ట్రలో 250 డిపోలు ఉండగా అందులో 46 డిపోల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థల్లో ఒకటైన MSRTCకి రూ.14 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పటి వరకు 20 బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు. మరో 19 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

మరాఠాలకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ నాందేడ్‌ జిల్లాలో సోమవారం జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ర్యాలీ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. శుక్రవారం జాల్నాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ వజీరాబాద్‌ ప్రాంతంలో నిరసనకారులు దుకాణాలపై రాళ్లు రువ్వారు. మరాఠాలకు రిజర్వేషన్‌లు కల్పించాలంటూ పలువురు రాజకీయ ప్రముఖులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

50శాతం పరిమితిని ఎత్తివేయాలి : ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌..
Sharad Power on Maratha Reservation : కోటాపై ఇప్పటివరకు ఉన్న 50శాతం పరిమితిని ఎత్తివేయాలని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. OBC వర్గాలకు రిజర్వేషన్లను సమకూర్చాలంటే ఇప్పుడున్న 50 శాతానికి అదనంగా 15 నుంచి 16శాతం పెంచాలన్నారు. ఓబీసీ కోటాలో ఎక్కువమంది లబ్ధిదారులను చేర్చడం వల్ల ఆ వర్గాల్లోని పేదలకు మరింత అన్యాయం జరుగుతుందని కొంతమంది చెబుతున్నారన్నారు శరద్‌పవార్‌. ఈ వాదనను విస్మరించొద్దనీ.. ఇప్పుడున్న 50శాతం పరిమితికి అదనంగా 15 నుంచి 16శాతం పెంచేలా కేంద్రం సవరణలు చేయాలని స్పష్టం చేశారు.

2018లో ఫడణవీస్‌ సీఎంగా ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. ఆ నిర్ణయాన్ని ముంబయి హైకోర్టు సమర్థించగా.. 2021లో సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. దీంతో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

Article 370 Supreme Court : ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

Sanatana Dharma Remark Row : 'స్టాలిన్​పై కఠిన చర్యలు తీసుకోవాలి'.. సుప్రీంకోర్టుకు 262 మంది ప్రముఖుల లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.