ETV Bharat / bharat

'ఫారెస్ట్​ వాచర్స్​'గా మన్య ప్రాంత మహిళలు - ఫారెస్ట్​ వాచర్​ నాగమ్మ

ఒకప్పుడు.. పురుషులకే పరిమితమైన అటవీ సంరక్షణ విధుల్లో ఇప్పుడు మహిళలూ కనిపిస్తున్నారు. కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళలు ఎన్నో ఏళ్లుగా అడవులను సంరక్షించే విధులు నిర్వహిస్తున్నారు. అడవుల్లో చెలరేగే మంటలను ఆర్పే చర్యల్లో పాలు పంచుకుంటున్నారు.

Many women from Karnataka working as forest watchers
ఫారెస్ట్​ వాచర్స్​గా రాణిస్తున్న మన్యప్రాంత అతివలు
author img

By

Published : Apr 8, 2021, 9:26 AM IST

ఫారెస్ట్​ వాచర్స్​గా రాణిస్తున్న మన్యప్రాంత అతివలు

గ్రామాల్లో, మరీ ముఖ్యంగా మన్య ప్రాంతాల్లో ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఎక్కువగా కనిపిస్తారు. ఉద్యోగాలు, ఇంటిబయటి పనులు చేసే మహిళలు చాలా తక్కువ. కానీ, కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళలు ఎన్నో ఏళ్లుగా అడవులను సంరక్షించే విధులు నిర్వహిస్తున్నారు.

"అటవీ శాఖలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నా. అన్ని విభాగాల్లో పనిచేశాను. నర్సరీ మొక్కల బాగోగులు చూసుకుంటా. వాటిని తీసుకెళ్లి అడవుల్లో నాటుతా. సోదాల్లోనూ పాల్గొన్నా. కార్చిచ్చును నియంత్రించే పనులూ చేశా."

- నాగమ్మ, అడవి కాపలాదారు

సహాయక చర్యల్లోనూ..

మలై మహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పీజీ ప్లాయా రేంజ్లో నాగమ్మ ఫారెస్ట్ వాచర్​గా పనిచేస్తోంది. పదేళ్లుగా ఈ విధులు నిర్వహిస్తోందీ మహిళ. అడవుల్లో చెలరేగే మంటలను ఆర్పే చర్యల్లో ఎన్నోసార్లు పాలుపంచుకుంది.

"డిపార్ట్మెంట్ చేపట్టిన ఎన్నో కఠినమైన, భయంకరమైన ప్రాజెక్టుల్లో నాగమ్మ పాల్గొంది. మా విభాగంలో చాలామంది మహిళలే పనిచేస్తున్నారు. ఎక్కువగా చామరాజనగర్ రేంజ్​లోని సోలిగ వర్గానికి చెందిన మహిళలు ఫారెస్ట్ వాచర్స్​గా పనిచేస్తున్నారు."

- మనోజ్ కుమార్, అటవీ అధికారి

పాతికేళ్లుగా..

25 ఏళ్లుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్​లో పనిచేస్తోంది నాగమ్మ. ఫారెస్ట్వాచర్ ఉద్యోగంలో చేరే ముందు డీఎఫ్​ఓ అధికారిగా పనిచేసేది. బీట్ అధికారిగా పదోన్నతి పొందింది. అంతేకాదు.. మలై మహదేశ్వర పరిధిలోని అడవుల్లో కార్చిచ్చును ఆర్పే పనుల్లో చురుగ్గా పాల్గొంది.

ఇదీ చదవండి: 30 ఏళ్లుగా 'ఆమె' కేరాఫ్ అడ్రస్​​ పోలీస్​ స్టేషన్​!

"ఏ పని అయినా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటా. మేమంతా ఓ కుటుంబంలా కలిసి పనిచేస్తున్నప్పుడు ఏదీ అసాధ్యం కాదని నేను నమ్ముతా. అటవీ విభాగంలో పనిచేస్తున్నంత మాత్రాన భయపడాల్సిన పనేమీ లేదు."

- నాగమ్మ, ఫారెస్ట్ వాచర్

అటవీ విభాగంలో వివిధ హోదాల్లో ఐదుగురు మహిళలు పనిచేస్తున్నారు. నాగమ్మ కాకుండా బీఆర్​టీ పులుల సంరక్షణ కేంద్రంలో మరో ముగ్గురు మన్య ప్రాంత అతివలు ఫారెస్ట్​ వాచర్స్​గా పనిచేస్తున్నారు. బందిపుర టైగర్ రిజర్వ్​లో ఓ మహిళ ఫారెస్ట్ వాచర్​ విధులు నిర్వహిస్తోంది.

"మలై మహదేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నాగమ్మ ఫారెస్ట్ వాచర్​గా పనిచేస్తోంది. నర్సరీ విభాగంలో విధులు నిర్వహిస్తోంది. కార్చిచ్చులను నియంత్రించే పనుల్లోనూ ఆమె పాల్గొంటుంది."

- ఏడుకొండలు, మలై మహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధికారి

మహిళలు అనుకుంటే ఎలాంటి పనులైనా చేయగలరు అన్న మాటలకు నిదర్శనంగా నిలుస్తున్న నాగమ్మ జీవితం.. ఎంతోమంది మహిళలకు ఆదర్శనీయం.

ఇదీ చదవండి: వైకల్యాన్ని ఎదుర్కొని ఎందరికో ఆదర్శంగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.