ETV Bharat / bharat

Indian Independence Day: దేశదీపధారులు- వీరే 'భారత' వీరులు

భారత్​ అంటే ఒకప్పుడు ప్రపంచదేశాలకు చులకనభావం ఉండేది. అయితే.. ఎందరో వీరులు తమ ప్రతిభా పాటవాలతో, పోరాట స్ఫూర్తితో భారత అజేయ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. తొలుత భారత్​ సైన్యాన్ని శత్రు భయంకరంగా తీర్చిదిద్దారు ఫీల్డ్​ మార్షల్​ శామ్​ మానెక్​షా. హక్కుల కోసం పోరాడిన హెచ్​.డి. శౌరి.. సంస్థానాలను భారత్​లో విలీనం చేసిన సర్దార్​ పటేల్​.. రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్​.. అణ్వస్త్ర పితామహుడు హోమీ జహంగీర్​ బాబా.. క్రికెట్​ దేవుడు సచిన్​ తెందుల్కర్​ ఇలా ఎందరో.. భారత్​ను విజేతగా నిలిపారు. నిలుపుతున్నారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

INDEPENDENCE DAY 2021
దేశదీపధారులు
author img

By

Published : Aug 15, 2021, 12:10 PM IST

మన సైనిక బాహుబలి..

1962 చైనా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా భారత్ అంటే ఓ చులకన భావం ఏర్పడింది. దీన్ని మార్చి.. భారత్ అజేయ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు 'ఫీల్డ్ మార్షల్' శామ్ మానెక్​షా. 1971లో పాకిస్థాన్​తో జరిగిన యుద్ధంలో సైన్యాధ్యక్షుడిగా భారత సేనలను ముందుండి నడిపించి, దాదాపు 90వేలకు పైగా శత్రు సైనికులు భారత్ ముందు మోకరిల్లేలా చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్​లో ఐదు యుద్ధాలు చూసిన మానెక్​షా.. భారత సైన్యాన్ని శత్రు భయంకరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. సైన్యంలో రాజకీయనేతల జోక్యానికి కూడా ఆదిలోనే గండికొట్టిన ఘనత మానెక్​షాదే!

హక్కుల 'వినియోగ' దారి

వినియోగదారుల హక్కులపై దేశంలో అంతగా అవగాహన, చైతన్యం లేని కాలంలో వాటి కోసం నినదించి, పోరాడిన వ్యక్తి హెచ్.డి. శౌరి. 69 ఏళ్ల వయసులో సాధారణంగా చాలా మంది రామా హరీ అంటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ వయసులో శౌరి... దేశంలో వినియోగదారుల ఉద్యమానికి ఊపిరిలూదారు. 80ల్లో శౌరి పేరు వింటే.. బడా సంస్థలకు హడల్. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలనేవి ఒకటున్నాయని తెలియని రోజుల్లో వాటితో న్యాయస్థానాల తలుపులను తడుతూ వినియోగదారుల హక్కుల కోసం దాదాపు 70కు పైగా దావాలు వేసి.. చాలా వాటిలో విజయం సాధించారు. ఆయన కృషి పలితంగానే జిల్లా స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఏర్పడ్డాయి. అలా వినియోగదారుల ఉద్యమానికి పాటుపడుతూనే 2005లో 93 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

ఆయనే కలపకుంటే...?

విభజన సమయంలో బ్రిటిషర్లు ఎన్నో కుయుక్తులకు పాల్పడ్డారు. అందులో భాగంగానే దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు. ఏ దేశంలో కలవాలో నిర్ణయించుకొనే అధికారం వాటికే కట్టబెట్టారు. దీంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాల విలీనం పెద్ద సమస్యగా మారింది. ఈ కఠినతర బాధ్యతను ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్​కు భారత్ నాయకులు అప్పగించారు. "దేశంలో చాలా రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే నీవల్లే అవుతుంది" అని మహాత్మాగాంధీ.. పటేల్​పై నమ్మకం ఉంచారు. కశ్మీర్ తప్పించి మిగిలిన వాటి బాధ్యత ఆయనపై పెట్టారు. ఆ నమ్మకాన్ని పటేల్ వమ్ము చేయలేదు. దాదాపు 565కు పైగా సంస్థానాలను భారత్​లో చేర్చారు. ప్రాణం పోయినా, భారత్​లో కలిసేది లేదని భీష్మించుకు కూర్చున్న సంస్థానధీశులను తన చాతుర్యంతో ఒప్పించారు. అదే సమయంలో మాటలతో దారికి రాని హైదరాబాద్ లాంటి సంస్థానాలను చేతలతో (సైనిక చర్యలు) దారికి తెచ్చారు.

రాజ్యాంగ రూపశిల్పి

వివిధ మతాలు, ప్రాంతాలు, కులాలతో ఎంతో వైవిధ్యత కలిగిన భారతదేశం నేడు ఓ అఖండ శక్తిగా, ప్రపంచ ప్రజాసామ్యానికి దిక్సూచిగా వెలుగుతోందంటే అందుకు కారణం భారత రాజ్యాంగం. దాని రూపశిల్పి బి.ఆర్. అంబేడ్కర్. ఒక సామూహిక శక్తిగా భారతదేశం ఎదగడానికి, అసమానతలు, అంతరాలు లేని సమసమాజ స్థాపనకు ఆయన రాజ్యాంగంలో పునాదులు వేశారు. ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయని నేర్పిన వ్యక్తి. షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు రిజర్వేషన్లు కల్పించి స్వాతంత్ర భారతంలో బడుగు, బలహీన వర్గాలకు భరోసా ఇచ్చిన నాయకుడు.

INDEPENDENCE DAY
అంబేడ్కర్​

భాషలకు పెద్ద పీట

సర్దార్ వల్లభాయ్ పటేల్ వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసి భారత భౌగోళిక సరిహద్దులను నిర్ణయిస్తే, ఆ భౌగోళిక స్వరూపంలో తిరిగి మార్పులు చేసింది తెలుగు తేజం పొట్టి శ్రీరాములే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ హయాం నాటి పరిపాలనా హద్దులను మార్చి, భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచాలని అప్పటి ప్రధాని నెహ్రూకు చాలా మంది సూచించారు. నెహ్రూ అంతగా మొగ్గు చూపలేదు. అలా చేస్తే దేశంలో హింస చెలరేగుతుందని భయపడ్డారు. కానీ ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన 56 రోజుల ఆమరణ నిరాహారదీక్షతో నెహ్రూ తలవంచక తప్పలేదు.

అణువంత... ధీమా!

ఈ రోజు భారత్ అణ్వస్త్ర దేశంగా అవతరించిందన్నా, ఆ పరిజ్ఞానంలో ప్రపంచదేశాలతో పోటీపడుతుందన్నా అందుకు కారణం.. హోమీ జహంగీర్ బాబా వేసిన పునాదులే. భారత్ అణు కార్యక్రమాన్ని ఆయన పరుగులు పెట్టించారు. చాలా దేశాలు అణుశక్తి ప్రయోజనాలను ఊహించని కాలంలోనే ఆయన ఆ శక్తి ప్రాముఖ్యాన్ని గుర్తించారు. తదనంతర కాలంలో భారత్ పోఖ్రాన్ లాంటి అణు ప్రయోగాలను దిగ్విజయంగా చేపట్టిందంటే అది ఈ అణ్వస్త్ర పితామహుడి చలవే.

INDEPENDENCE DAY
హోమీ జహంగీర్​ బాబా

ఆర్థిక స్వాతంత్ర్య ప్రదాత

భారతదేశ స్వాతంత్ర్యం 1947లో వస్తే, ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది మాత్రం 1991లోనే. అది తెచ్చింది మన తెలుగు దిగ్గజం పీవీ నరసింహారావే. చాణక్యుడు అర్థశాస్త్రం రాస్తే, మన అపర చాణక్యుడు ఆ ఆర్థికశాస్త్రాన్ని తిరగరాసి దేశ ఆ అభివృద్ధి రథ చక్రాలను పరుగులు తీయించారు. ప్రధానిగా పీవీ అధికారం చేపట్టే సమయానికి బంగారం కుదువ పెట్టి దేశాన్ని నడపాల్సిన పరిస్థితి.

INDEPENDENCE DAY
పీవీ నరసింహారావు

అలాంటి ఖజానాలో ఇబ్బడిముబ్బడిగా నేడు విదేశీ మారకద్రవ్య నిల్వలు పేరుకున్నాయంటే కారణం.. పీవీ దూరదృష్టే.

ఆకలి తీర్చిన 'పచ్చ'తోరణం

దేశానికి వ్యవసాయం వెన్నెముక. మరి ఆ వెన్నెముకే జారితే.. 1960ల్లో అదే జరిగింది. వ్యవసాయ దిగుబడులు నానాటికీ తీసికట్టుగా మారడంతో దేశం ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా క్షామం. వ్యవసాయాధారిత దేశం కాస్త ఎక్కడ వ్యవసాయ దిగుమతి దేశంగా మారుతుందేమోనన్న ఆందోళన. ఆ పరిస్థితుల్లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎం. ఎస్. స్వామినాథన్ నేతృత్వంలో మొదలైన హరిత విప్లవం దేశం ఆహార రంగ రూపురేఖలనే సమూలంగా మార్చేసింది. స్వామినాథన్ దేశమంతా తిరుగుతూ రైతులను చైతన్యపరిచారు. అధిక దిగుబడులిచ్చే వరి, గోధుమ వంగడాలతో దేశం ఆహార స్వయం సమృద్ధి సాధించేలా చూశారు.

చందమామ రావే...

అగ్రరాజ్యాలతో పోటీపడుతూ నేడు దేశం అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తోందంటే.. చందమామకు యాత్రలు చేస్తుందంటే.. అది భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఘనతే. ఆయన ప్రయోగాల ఫలితంగానే భారత దేశం తన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అక్కడి నుంచి మొదలైన మన ప్రస్థానం నేడు చంద్రయాన్​ లాంటి యాత్రలు చేపట్టేస్థాయికి చేరడంలో సారాభాయ్ కృషి ఉంది.

ఆయనే ఇస్రో తొలి చైర్మన్​గా కూడా వ్యవహరించారు.

INDEPENDENCE DAY
విక్రమ్​ సారాభాయ్​

క్రికెట్ దేవుడు

మూడు అక్షరాలు చాలు.. ఆసేతు హిమాచలం ఉప్పొంగిపోవడానికి! అతడు బ్యాట్ కదిలిస్తే చాలు కోట్లాది మంది పరవశులైపోవడానికి! ఒకటా రెండా రెండు దశాబ్దాలకు పైగా తన మహత్తర ఆటతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు.. మరెన్నో ఘనతలు! 1989లో పాకిస్థాన్​పై అరంగేట్రం చేసిన నాటి నుంచి 2013లో వెస్టిండీస్​పై తన చివరి మ్యాచ్ వరకు సచిన్ ఆటను కళ్లార్పకుండా చూసిన కళ్లు ధన్యమైనట్లే. సొగసైన బ్యాటింగ్​కు దూకుడు కలబోసి ఈ మాస్టర్ బ్లాస్టర్ చెలరేగిపోతుంటే అభిమానులు పిచ్చెక్కి పోయేవాళ్లు. అతడి తరంలో పుట్టిన ఎంతోమంది గొప్ప బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. భారత బ్యాటింగ్​కు మూలస్తంబంగా నిలిచిన సచిన్ ఈ శతాబ్దంలో అభిమానుల నీరాజనాలను అందుకున్న గొప్ప ఆటగాళ్లలో ఒకడు.

INDEPENDENCE DAY
సచిన్​ తెందుల్కర్​
INDEPENDENCE DAY
భారత ఘనతలు
INDEPENDENCE DAY
భారత ఘనతలు

ఇవీ చదవండి: మార్చి 16: ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరపురాని రోజు

రైతులను ఆదుకునేందుకు కేంద్రానికి స్వామినాథన్‌ సూచనలు

జాతి గౌరవ పతాక.. అంబేడ్కర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.