ETV Bharat / bharat

Manipur Violence CBI : సీబీఐ చేతికి మరో 9 'మణిపుర్​ అల్లర్ల' కేసులు.. మహిళా అధికారులను కూడా.. - మణిపుర్ అల్లర్లు శాంతి ర్యాలీ

Manipur Violence CBI : సీబీఐ.. మణిపుర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేయనుంది. మరోవైపు, రాష్ట్రంలో ప్రధాని మోదీ.. శాంతి ర్యాలీ నిర్వహిస్తే తాము కూడా పాల్గొంటామని కాంగ్రెస్​ నేత అధీర్​ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు.

Manipur Violence CBI
Manipur Violence CBI
author img

By

Published : Aug 13, 2023, 4:40 PM IST

Updated : Aug 13, 2023, 5:08 PM IST

Manipur Violence CBI : మణిపుర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో తొమ్మిది కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారించనుంది. ఇంతకుముందు 8 కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. ప్రస్తుత కేసులతో కలిపి ఆ సంఖ్య 17కు పెరిగింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ 17 కేసులకే పరిమితం కాదని అధికారులు తెలిపారు. మహిళలపై నేరాలు లేదా లైంగిక వేధింపులకు సంబంధించిన ఇతర కేసులను కూడా ప్రాధాన్యతపై సీబీఐకి రిఫర్ చేయవచ్చని పేర్కొన్నారు.

కేసుల దర్యాప్తు కోసం మహిళా అధికారులను కూడా..
Manipur Violence CBI Investigation : సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో చురాచంద్‌పుర్ ఘటన సహా అంతకుముందు జరిగిన అమానుష ఘటన కేసు కూడా ఉంది. మణిపుర్‌లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం మహిళా అధికారులను కూడా సీబీఐ తమ బృందంలో చేర్చుకుంది. బాధిత మహిళల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడానికి ప్రశ్నించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

'మోదీ.. శాంతి ర్యాలీ నిర్వహిస్తే.. మేం కూడా చేరతాం'
Adhir Ranjan Chowdhury On Modi : మణిపుర్ అల్లర్లను ఆపేందుకు.. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ.. నాయకత్వం వహించి, అక్కడ శాంతి ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి కోరారు. మణిపుర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు దేశం మొత్తం తమ వెంట నిలుస్తుందని ప్రధాని మోదీ వారికి చెప్పాలని ఆయన అన్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి మోదీ నాయకత్వం వహిస్తే.. తాము కూడా శాంతి ర్యాలీలో పాల్గొంటామని అధీర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. తాము ఈ సూచనను లిఖికపూర్వకంగా లోక్​సభలో ఇచ్చామని.. కానీ వారు(కేంద్ర ప్రభుత్వం) పట్టించుకోలేదని ఆరోపించారు.

'మణిపుర్‌పై మోదీ మాట్లాడతారని తెలిసి ఉంటే..'
Loksabha Opposition Walkout : అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్​సభలో మోదీ ప్రసంగిస్తున్నప్పుడు.. విపక్షాలు ఎందుకు వాకౌట్​ చేశాయో కాంగ్రెస్​ నేత అధీర్​ రంజన్​ చౌదరి మరోసారి స్పష్టం చేశారు. "సుమారు రెండు గంటలపాటు కూర్చుని మోదీ ప్రసంగం విన్నాం. కనీసం ఆయన ఎక్కడా.. మణిపుర్​ అంశాన్ని ప్రస్తావించలేదు. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు వారి కేబినెట్​ మంత్రులే నిద్రపోయారు. కావాలంటే మీరు విజువల్స్​ చూడవచ్చు. ప్రసంగం ముగిసే సమయానికి మణిపుర్ అంశంపై కేవలం మూడు నిమిషాలే మోదీ మాట్లాడారు. మణిపుర్‌పై ప్రధాని మాట్లాడతారని తెలిసి ఉంటే మేం బయటకు వచ్చేవాళ్లం కాదు" అని చెప్పారు.

Last Updated : Aug 13, 2023, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.