ETV Bharat / bharat

రాహుల్​ను అడ్డుకున్న మణిపుర్​ పోలీసులు.. హెలికాప్టర్​లో చుర్​చాంద్​పుర్​కు.. నిర్వాసితులతో ముచ్చట్లు - మణిపుర్​కు రాహుల్ గాంధీ

Manipur Rahul Gandhi
Manipur Rahul Gandhi
author img

By

Published : Jun 29, 2023, 1:20 PM IST

Updated : Jun 29, 2023, 5:18 PM IST

17:17 June 29

పునరావాస కేంద్రాలకు రాహుల్​

ఎట్టకేలకు మణిపుర్​ చురచాంద్​పుర్​లోని పునరావాస కేంద్రాలను చేరుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అందులో ఉన్న నిర్వాసితుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

16:39 June 29

మణిపుర్ అల్లర్లలో కాంగ్రెస్​దే ప్రధాన పాత్ర

వారసత్వ సమస్య వల్లే మణిపుర్‌లో అల్లర్లు జరుగుతున్నాయని, అందులో కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రధానపాత్ర పోషించినట్లు బీజేపీ ఆరోపించింది. ఆల్‌ మణిపుర్‌ స్టూడెంట్‌ యూనియన్‌, పౌర హక్కుల సంఘాలు రాహుల్‌ పర్యటనను బహిష్కరించాలని పిలుపునిచ్చినట్లు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తెలిపారు. అయినా రాహుల్‌ గాంధీ అల్లర్లు జరుగుతున్న మణిపుర్‌ పర్యటనకు వెళ్లటం.. బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

16:03 June 29

హెలికాప్టర్​లో చుర్​చాంద్​పుర్​కు

పోలీసులు అడ్డుకోవడం వల్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెలికాప్టర్​లో చుర్​చాంద్​పుర్​కు బయలుదేరారు. అనేక గంటలపాటు బిష్ణుపుర్​లో రాహుల్​ను ఆపేశారు పోలీసులు. దీంతో తిరిగి ఇంఫాల్​కు చేరుకున్న రాహుల్​.. హెలికాప్టర్​లో పయనమయ్యారు.

15:42 June 29

పోలీసులపై కాంగ్రెస్‌ ఫైర్​

రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్‌ను అడ్డుకునేందుకు.. ప్రధాని మోదీ నిరంకుశ పద్దతులు అవలంబిస్తున్నారని విమర్శించింది. ప్రభుత్వ నిర్బంధ చర్య రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను విచ్ఛినం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సహాయ శిబిరాల్లో బాధితులకు ధైర్యం చెప్పేందుకు రాహుల్‌ అక్కడికి వెళ్తున్నారని ఖర్గే ట్వీట్‌ చేశారు. మణిపుర్‌పై మౌనం వీడని ప్రధాని.. ప్రతిపక్షాలపై మాత్రం నిర్భంధం అమలు చేస్తున్నారని విమర్శించారు. మణిపుర్‌కు ఇప్పుడు శాంతి అవసరమని ఘర్షణ కాదని ఖర్గే అన్నారు

14:12 June 29

రాహుల్​ను అడ్డుకున్న పోలీసులు.. పరామర్శకు వెళ్లేందుకు నో..

ఎందుకు అడ్డుకున్నారో అర్థం కావడం లేదు : కేసీ వేణుగోపాల్
రాహుల్​ గాంధీని పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్​ స్పందించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను బిష్ణుపుర్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. మిమ్మల్ని అనుమతించే పరిస్థితి లేదని చెబుతున్నారు. రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఉన్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో అర్థం కావడం లేదు.' అని అన్నారు.

10:06 June 29

Manipur Rahul Gandhi : హింసాత్మక ఘటనలతో అతలాకుతలమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్​లోని నిర్వాసితులను పరామర్శించేందుకు ​వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అడ్డుకున్నారు పోలీసులు. బిష్ణుపుర్​ జిల్లాలోని ఉట్లౌ గ్రామ సమీపంలో హైవేపై టైర్లు తగులబెట్టారని.. కాన్వాయ్​పై రాళ్లు విసిరారని పోలీసులు తెలిపారు. 'ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయనే భయంతో ముందు జాగ్రత్త చర్యగా కాన్వాయ్​ను ఆపాల్సిందిగా అభ్యర్థించాము' అని పోలీసులు తెలిపారు. రాహుల్​ గాంధీని అడ్డుకోకుండా.. చురచంద్​పుర్​కు వెళ్లనివ్వాలంటూ పోలీసులు, ఆర్మీ అధికారులతో కాంగ్రెస్​ పార్టీ నాయకులు చర్చించారు.

అంతకుముందు ఇంఫాల్, చురచంద్‌పుర్‌లలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను రాహుల్ సందర్శించి.. అక్కడ పౌర సమాజ ప్రతినిధులతో చర్చిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. మణిపుర్ రెండు నెలలుగా హింసాత్మక ఘటనలతో అతలాకుతలం అవుతోందని.. సమాజాన్ని ఘర్షణ నుంచి శాంతి మార్గం వైపు పయనించేలా చేయడం అవసరం హస్తం పార్టీ వెల్లడించింది. ద్వేషంతో కాకుండా ప్రేమగా కలిసి ఉండడం మన బాధ్యతని కాంగ్రెస్‌ పార్టీ వివరించింది. గురువారం, శుక్రవారం రాహుల్ గాంధీ మణిపుర్​లో పర్యటిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రంలో ప్రశాంతత వెల్లివిరియాలంటే సమాజంలో శాంతి అవసరమని వేణుగోపాల్​ అన్నారు.

మణిపుర్​పై అఖిలపక్ష సమావేశం
Manipur All Party Meeting : ఎస్టీ హోదా కోసం మైటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ లోయ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఇది ఘర్షణకు దారితీయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇటీవల మణిపుర్ అల్లర్లపై కేంద్రహోం మంత్రి అమిత్‌ షా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మణిపుర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అమిత్‌ షా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్ చెప్పారు. అంతకుముందు అమిత్ షా సైతం నాలుగు రోజుల పాటు మణిపుర్​లో పర్యటించారు. మరోవైపు ముఖ్యమంత్రిగా బీరెన్‌ సింగ్‌ను తప్పించి.. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌లు వస్తున్నాయి. మణిపుర్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని.. హింసాత్మక ఘటనలను కేంద్ర హోం మంత్రి నియంత్రించలేకపోయారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

Last Updated : Jun 29, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.