ETV Bharat / bharat

జర్నలిస్ట్​ టు సీఎం.. వరుసగా ఐదోసారి విజయదుందుభి - బీరెన్​ సింగ్​ రాజకీయ ప్రస్థానం

Chief Minister of Manipur: ఎన్​ బీరెన్​ సింగ్​.. జర్నలిస్ట్​గా జీవితాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మణిపుర్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తనకు ఎదురులేదని నిరూపించారు. ఒక ఫుట్​బాల్​ క్రీడాకారుడిగా, జర్నలిస్ట్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. క్రియాశీల రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

CM N Biren Singh
మణిపుర్​ ముఖ్యమంత్రి ఎన్​ బీరెన్​ సింగ్
author img

By

Published : Mar 10, 2022, 5:09 PM IST

Updated : Mar 10, 2022, 5:53 PM IST

Chief Minister of Manipur: మణిపుర్​ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్​ బీరెన్​ సింగ్​.. మరోమారు హెయ్​గాంగ్​ నియోజకవర్గంలో గెలుపొందారు.ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పంగిజం శరత్​చంద్ర సింగ్​పై 17వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. దీంతో వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు సింగ్​.

బీరెన్​ సింగ్​ రాజకీయ ప్రస్థానం​..

  • రాజకీయాల్లోకి రాకముందు ఫుట్​బాల్​ ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు బీరెన్​ సింగ్​. స్పోర్ట్స్​ కోటాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)లోనూ చేశారు​. కానీ, కొద్ది రోజులకే ఆ ఉద్యోగాన్ని వదులుకుని జర్నలిజం వైపు అడుగులు వేశారు. 1992లో నహరోల్జి తౌడాంగ్​ అనే వార్తా పత్రికను ప్రారంభించారు. 2001 వరకు దానికి ఎడిటర్​గా పని చేశారు.
  • ఒక ఫుట్​బాల్​ క్రీడాకారుడిగా, జర్నలిస్ట్​గా తనకంటూ ఓ హోదా సంపాదించుకున్న బీరెన్​ సింగ్​ 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్​ రెవల్యూషనరీ పీపుల్స్​ పార్టీలో చేరారు. అయితే.. అదే ఏడాది కాంగ్రెస్​లోకి వెళ్లారు. అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్​ ఇబోబి సింగ్​ మంత్రివర్గంలో విజిలెన్స్​ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్​ హయాంలో నీటిపారుదల, ఆహార నియంత్రణ, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ వంటి కీలక పదవులు నిర్వర్తించారు బీరెన్​ సింగ్​. మాజీ సీఎం ఓక్రమ్​ ఇబోబి సింగ్​కు అత్యంత సన్నిహితుడిగానూ పేరు గడించారు.
  • పార్టీతో తలెత్తిన విబేధాల కారణంగా కాంగ్రెస్​కు రాజీనామా చేసి 2016లో భాజపాలో చేరారు బీరెన్​ సింగ్​. 2017లో కాషాయ పార్టీ టికెట్​పై హెయ్​గాంగ్​ నియోజకవర్గంలో గెలుపొందారు. ఎన్​పీపీ, ఎన్​పీఎఫ్​, ఎల్​జేపీ, టీఎంసీ భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికై 2017, మార్చి 15న మణిపుర్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత మొదలైన క్రమంలో తన రాజకీయ చతురతతో వాటిని సద్దుమణిగేలా చేశారు. మరోమారు భాజపాను అధికారంలోకి తేవటంలో విజయం సాధించారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 10, 2022, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.