ETV Bharat / bharat

మణిపుర్​ సీఎంగా బీరెన్​ సింగ్​ ప్రమాణ స్వీకారం

author img

By

Published : Mar 21, 2022, 3:29 PM IST

Updated : Mar 21, 2022, 4:22 PM IST

Manipur CM swearing in ceremony: మణిపుర్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్​ బీరెన్​ సింగ్​. ఇంపాల్​లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్​ గణేశన్​ ఆయన చేత ప్రమాణం చేయించారు.

N Biren Singh
బీరెన్​ సింగ్​ ప్రమాణ స్వీకారం

Manipur CM swearing in ceremony: మణిపుర్​ ముఖ్యమంత్రిగా ఎన్​ బీరెన్​ సింగ్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్​ గణేషన్​ను ఆయన చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నెంచా కిప్జెన్​, వై ఖేంచాంద్​ సింగ్​, బిస్వజిత్​ సింగ్​, అవాంగ్​బౌ న్యూమాయ్​, గోవిందాస్​ కొంతౌజమ్​ చేత గవర్నర్​ ప్రమాణం చేయించారు. ఇంపాల్​లో జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు అగ్ర నేతలు హాజరయ్యారు.

" మా ప్రభుత్వ తొలి అడుగు రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకే. రాష్ట్రం నుంచి అవినీతిని తరిమికొట్టేందుకు నేను రాత్రింబవళ్లు పని చేస్తా. ఆ తర్వాత రాష్ట్రం నుంచి మత్తుపదార్థాలకు సంబంధించిన అంశాలపై చర్యలు ఉంటాయి."

- ఎన్​ బీరెన్​ సింగ్​, మణిపుర్​ ముఖ్యమంత్రి.

బీరెన్​ సింగ్​.. హెయ్​గాంగ్​ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పంగిజం శరత్​ చంద్ర సింగ్​పై 17వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. దీంతో వరుసగా ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు సింగ్​. ఈ ఎన్నికల్లో భాజపా ఒంటరిగా పోటీ చేసి 32 చోట్ల గెలుపొందింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్​ ఫిగర్​ను చేరుకుంది.

బీరెన్​ సింగ్​ రాజకీయ ప్రస్థానం​..

  • రాజకీయాల్లోకి రాకముందు ఫుట్​బాల్​ ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు బీరెన్​ సింగ్​. స్పోర్ట్స్​ కోటాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)లోనూ చేశారు​. కానీ, కొద్ది రోజులకే ఆ ఉద్యోగాన్ని వదులుకుని జర్నలిజం వైపు అడుగులు వేశారు. 1992లో నహరోల్జి తౌడాంగ్​ అనే వార్తా పత్రికను ప్రారంభించారు. 2001 వరకు దానికి ఎడిటర్​గా పని చేశారు.
  • ఒక ఫుట్​బాల్​ క్రీడాకారుడిగా, జర్నలిస్ట్​గా తనకంటూ ఓ హోదా సంపాదించుకున్న బీరెన్​ సింగ్​ 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్​ రెవల్యూషనరీ పీపుల్స్​ పార్టీలో చేరారు. అయితే.. అదే ఏడాది కాంగ్రెస్​లోకి వెళ్లారు. అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్​ ఇబోబి సింగ్​ మంత్రివర్గంలో విజిలెన్స్​ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్​ హయాంలో నీటిపారుదల, ఆహార నియంత్రణ, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ వంటి కీలక పదవులు నిర్వర్తించారు బీరెన్​ సింగ్​. మాజీ సీఎం ఓక్రమ్​ ఇబోబి సింగ్​కు అత్యంత సన్నిహితుడిగానూ పేరు గడించారు.
  • పార్టీతో తలెత్తిన విబేధాల కారణంగా కాంగ్రెస్​కు రాజీనామా చేసి 2016లో భాజపాలో చేరారు బీరెన్​ సింగ్​. 2017లో కాషాయ పార్టీ టికెట్​పై హెయ్​గాంగ్​ నియోజకవర్గంలో గెలుపొందారు. ఎన్​పీపీ, ఎన్​పీఎఫ్​, ఎల్​జేపీ, టీఎంసీ భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికై 2017, మార్చి 15న మణిపుర్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత మొదలైన క్రమంలో తన రాజకీయ చతురతతో వాటిని సద్దుమణిగేలా చేశారు. మరోమారు భాజపాను అధికారంలోకి తేవటంలో విజయం సాధించారు.

ఇదీ చూడండి: రాజ్యసభకు భజ్జీ.. లోక్​సభకు 'షాట్​ గన్' నామినేషన్

Last Updated : Mar 21, 2022, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.