ETV Bharat / bharat

ఉగ్రదాడిపై 'ప్రతీకారం' కోసం భారీ కుంబింగ్​ ఆపరేషన్​

అసోం రైఫిల్స్​పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఘటనాస్థలంలో భారీ కుంబింగ్​ ఆపరేషన్​ చేపట్టింది. ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదనే లక్ష్యంతో జవాన్లు క్షేత్రస్థాయిలోకి దిగారు. ఉగ్రవాదులు మయన్మార్​కు పారిపోకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Manipur ambush
మణిపుర్ హింసాకాండ
author img

By

Published : Nov 13, 2021, 8:54 PM IST

మణిపుర్​లో అసోం రైఫల్స్​పై జరిగిన ఉగ్రదాడిని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఘటన జరిగిన చురాచంద్​పుర్​ ప్రాంతంలో భారీ కుంబింగ్​ ఆపరేషన్​ చేపట్టారు. ఘటనకు పాల్పడిన వారు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో పారామిలిటరీ దళాలు, కమాండోలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అటు ఉగ్రవాదులు.. సరిహద్దుల్లోని మయన్మార్​కు పారిపోకుండా ఉండేందుకు.. అక్కడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వివరాలను మణిపుర్​ ముఖ్యమంత్రి బీరెన్​ సింగ్​ వెల్లడించారు. ఉగ్రదాడిలో గాయపడి.. ఇంపాల్​లోని షిజియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవానును ఆయన​ పరామర్శించారు. జవానుకు మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను, ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.

జవాన్లపై ఉగ్రవాదుల హింసాకాండకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు వివరించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

మణిపుర్​లోని చురాచంద్​పుర్ జిల్లా సింఘాట్ సబ్​ డివిజన్​ అసోం రైఫిల్స్ కమాండింగ్‌ ఆఫీసర్‌ కాన్వాయ్‌పై శనివారం మధ్యాహ్నం ఉగ్రవాదులు భీకర దాడి జరిపారు. ఈ ఘటనలో అసోం రైఫిల్స్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన భార్య, ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. అసోం రైఫిల్స్​కు చెందిన మరో నలుగురు సిబ్బంది సైతం చనిపోయారని పేర్కొంది. నలుగురు జవాన్లు గాయపడ్డారని వివరించింది.

దాడి సమయంలో కాన్వాయ్‌లో కమాండింగ్‌ ఆఫీసర్‌ కుటుంబసభ్యులు, తక్షణ స్పందన సిబ్బంది ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు తొలుత ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారని ఆర్మీ అధికారులు తెలిపారు. అనంతరం కాన్వాయ్​పై కాల్పులు జరిపారని చెప్పారు. కర్నల్ విప్లవ్ త్రిపాఠి.. తన ఫార్వర్డ్ బేస్ నుంచి బెటాలియన్ హెడ్​క్వాటర్స్​కు వెళ్తున్నారని వివరించారు.

మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరులైన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సైనికుల త్యాగం మరువలేనిదని అన్నారు.

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ సైతం ఘటనను ఖండించారు. ఈ దాడికి పాల్పడినవారిని విడిచిపెట్టేది లేదని అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.