ETV Bharat / bharat

'భాజపా టికెట్ నాకొద్దు.. ఉద్యోగమే ముద్దు' - కేరళ వయనాడ్​ జిల్లా

ఎన్నికల వేళ పోటీకి అవకాశం ఇస్తారని అభ్యర్థులు తహతహలాడుతుంటే ఓ వ్యక్తి మాత్రం వచ్చిన అవకాశానికి నో చెప్పాడు. కేరళలోని మనంతవాడీ నియోజకవర్గ అభ్యర్థిగా భాజపా మణికంఠన్​ పేరును ప్రకటించగా.. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదంటూ ఆ ఆఫర్​ను తిరస్కరించాడు.

bjp, kerala
భాజపా ఆఫర్​ను తిరస్కరించిన అభ్యర్థి
author img

By

Published : Mar 15, 2021, 1:31 PM IST

కేరళలోని వయనాడ్​ జిల్లా మనంతవాడీ నియోజకవర్గం భాజపా అభ్యర్థి మణికంఠన్ తాను ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించారు. ఈ విషయాన్ని సోమవారం ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదన్నారు.

"వయానాడ్​ వాసిగా నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. కానీ నాకు స్థానికంగా ఉన్న పశువైద్య శాస్త్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా కొనసాగడమే ఇష్టం. నాకు క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి లేదు. కాబట్టి నేను ఈ అవకాశాన్ని తిరస్కరిస్తున్నాను."

-మణికంఠన్, మనంతవాడీ భాజపా అభ్యర్థి

ఇదీ జరిగింది..

కేరళ ఎన్నికల అభ్యర్థుల పేర్లతో భాజపా ఆదివారం తొలి జాబితా ప్రకటించింది. అందులో మణికంఠన్​ పేరు కూడా ఉంది. ప్రకటన వచ్చేవరకు ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని మణికంఠన్ పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీపై భాజపా మణికంఠన్​ను సంప్రదించిందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయంపై ఇంకా భాజపా స్పందించలేదు. ​

ఇదీ చదవండి : కేరళ సీఎం విజయన్​ నామినేషన్​ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.