కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. గర్భంతో ఉన్న భార్యను హతమార్చాడు ఓ వ్యక్తి. అనంతరం బంగ్లాదేశ్‌కు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడు నాజీర్ హుస్సేన్(29)ను సుద్దగుంటెపాల్య పోలీసులు బంగాల్లో అరెస్ట్ చేశారు. అతడిని బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడిగా గుర్తించారు.
"నిందితుడు బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ శిక్షణ పొందాడు. అతడికి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ రిపేర్‌లో నైపుణ్యం ఉంది. నిందితుడు తప్పుడు పత్రాలు సృష్టించి సిలిగుడి మీదుగా కోల్‌కతా చేరుకున్నాడు. ఆ తర్వాత ముంబయి, దిల్లీ, గుర్‌గ్రామ్‌లో మొబైల్ రిపేర్ షాపులను నిర్వహించాడు. 2019లో బెంగళూరు వచ్చి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అతడికి నెలకు రూ.75 వేల జీతం. దిల్లీ అడ్రస్‌తో ఆధార్ కార్డు, కోల్‌కతా చిరునామాతో పాన్ కార్డు, బెంగళూరు చిరునామాతో ఓటరు గుర్తింపు కార్డు ఉంది. బెంగళూరుకు చెందిన నాజ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆరు నెలలపాటు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితం.. ఒక్కసారిగా మారిపోయింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో జనవరి 16న ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం బంగ్లాదేశ్‌కు పారిపోయే ప్రయత్నం చేశాడు."
--పోలీసులు
భర్తపై యాసిడ్ దాడి..
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడి అతడి ముఖంపై యాసిడ్ పోసింది ఓ మహిళ. దీంతో భర్త ముఖం కాలిపోయింది. బాధితుడు తన భార్యపై కలెక్టర్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్పించి.. నిందితురాలు పూనమ్‌ను అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కోపర్గంజ్కు చెందిన గుప్తా, పూనమ్ భార్యాభర్తలు. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. దీంతో పూనమ్‌ను గుప్తా కొట్టగా.. ఆమె కిందపడిపోయింది. కోపోద్రిక్తురాలైన పూనమ్ బాత్రూమ్లో ఉన్న యాసిడ్‌ను గుప్తా ముఖంపై పోసింది. దీంతో గుప్తా ముఖం కాలిపోయింది. అనంతరం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా.. పూనమ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు స్థానికులను విచారించగా.. గుప్తా మద్యానికి బానిసయ్యాడని.. అందుకే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని చెప్పారు.
ఇవీ చదవండి: