ETV Bharat / bharat

ఎయిర్​ఇండియా సీన్ రిపీట్.. ఆర్​టీసీ బస్సులో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి! - urination in bus

ప్రభుత్వ బస్సులో తోటి ప్రయాణికురాలి సీటుపై మూత్రం పోశాడు ఓ వ్యక్తి. దీనిపై ఆర్​టీసీ స్పందించింది. అతడిపై చర్యలు తీసుకునేందుకు ఆ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

man urinated on a woman passenger
man urinated on a woman passenger
author img

By

Published : Feb 23, 2023, 4:31 PM IST

ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. తాజాగా అలాంటి ఘటనే మరోటి జరిగింది. ఓ బస్సులో వెళ్తున్న వ్యక్తి.. తోటి మహిళా పాసింజర్​​ సీటుపై మూత్రం పోశాడు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులో ఫిబ్రవరి 21న ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో అతడు మూత్రం పోశాడని అధికారులు చెబుతున్నారు.

ఆ వ్యక్తి మూత్రం పోసిన వెంటనే ప్రయాణికురాలు.. బస్సు కండక్టర్​కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్​, కండక్టర్ కలిసి ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అతడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. కానీ, మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. బస్సులోనే క్షమాపణ చెప్పినట్లు కేఎస్ఆర్​టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తన వ్యక్తిగత వివరాలేవీ బయటపెట్టలేదని తెలిపింది. మరోవైపు, ప్రయాణికురాలు సైతం అతడిపై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారని కేఎస్ఆర్​టీసీ వివరించింది. దీంతో బస్సు షెడ్యూల్ ప్రకారం గమ్యాన్ని చేరుకుందని స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఆర్​టీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్​టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఇలాగే తోటి మహిళా పాసింజర్​పై మూత్రం పోశాడు. మద్యం మత్తులో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నవంబర్ 26న జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్​కు బాధితురాలు లేఖ రాసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. తనపై నిందితుడు మూత్రం పోసిన సమయంలో ఎయిర్ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపించారు. దీంతో ఎయిర్​ఇండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమ ఉద్యోగుల తీరుపై చంద్రశేఖరన్ సైతం విచారం వ్యక్తం చేశారు. తగిన రీతిలో స్పందించాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆ ఘటనలో నిందితుడు శంకర్ మిశ్ర.. కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలో ఉండి చివరకు పోలీసులకు చిక్కాడు. అతడికి కోర్టులో బెయిల్ లభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.