Man Turned House Into Cow Shed : ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. ఆవుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు! ఆవుల పరిస్థితి చూసి చలించిపోయి.. తన ఇంటినే గోశాలగా మార్చేశాడు. ఎందరో వచ్చి పెళ్లి కోసం ప్రతిపాదనలు తెచ్చినా నిరాకరించి మరీ గోసేవ చేస్తున్నాడు. దీంతో అతడిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిస్తున్నారు.
జిల్లాలోని ఔరంగాబాద్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గోశాలలో ఆవుల పరిస్థితి చూసి బాధపడ్డాడు. అక్కడ ఆవులకు సేవ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించాడు. గోశాలలో గాయపడిన ఆవుల దుస్థితి చూసి చలించిపోయినట్లు చెప్పాడు. దీంతో తన పాత ఇంటిని గోశాలగా మార్చినట్లు చెప్పాడు.
బంధవులు, గ్రామపెద్దలు సహా అనేక మంది తన వద్దకు పెళ్లి ప్రతిపాదనలు తెచ్చారని సునీల్ కుమార్ తెలిపాడు. వాటిన్నంటికి నిరాకరించానని చెప్పాడు. రాత్రింబవళ్లు గోసేవలో నిమగ్నమై ఉంటానని పేర్కొన్నాడు. విచ్చలవిడిగా జంతువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం విఫలమైందని ఆరోపించాడు. సర్కార్ మంజూరు చేసిన నిధులను అధికారులు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు చేశాడు. వార్తాపత్రికల్లో ప్రభుత్వ గోశాలలు బాగా నడుస్తున్నట్లు కథనాలు వస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పాడు.
హిందూ మతంలో ఆవును గౌరవింగా భావిస్తారని.. భక్తిశ్రద్ధలతో పూజిస్తారని సునీల్ కుమార్ తెలిపాడు. అందుకే జీవితాంతం ఆవులకు సేవలు చేస్తానని చెప్పాడు. పెళ్లి చేసుకోనని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. వివాహం జరిగాక.. కొన్ని పరిస్థితుల దృష్ట్యా గోసేవ చేయలేమని.. అందుకే పెళ్లి ప్రతిపాదనలు తిరస్కరించినట్లు వివరించాడు.
టూరిస్ట్‌గా వచ్చి మాతాజీగా మారి.. 40 ఏళ్లుగా గోసేవ
కొన్నేళ్ల క్రితం.. మన దేశంలో పర్యటక ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన జర్మనీ మహిళ ఫ్రైడెరిక్ ఇరీనా.. భారత సంస్కృతికి ఆకర్షితులయ్యారు. భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే సుదేవీ మాతాజీగా మారారు. మొదట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలుగా గోసేవలో నిమగ్నమయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో గాయమైన ఆవులను చేరదీసి వాటికి చికిత్స చేయిస్తారు. అందుకోసం రాధా సురభి గోశాలను 1996లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో స్థాపించారు. గాయపడిన వేలాది గోవులను గోశాలకు తరలించి వైద్యం చేయిస్తున్నారు. 3 వేలకుపైగా గోవులు గోశాలలో ఉన్నాయి. వీటి నిర్వహణకు సుమారు 80 మంది పని చేస్తుంటారు. వారిలో కొందరు పశువైద్యులు కూడా ఉన్నారు. ఆమె గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Cow Music Therapy In Madhya Pradesh : గోవులకు చికిత్స సమయంలో మ్యూజిక్.. అందుకోసమేనట!