ETV Bharat / bharat

Covid vaccine fear: టీకా వద్దని తేయాకు తోటలో పరుగో పరుగు

Covid vaccine fear: ప్రజల్లో కొవిడ్​ టీకాపై అపోహలు ఇంకా తొలగిపోలేదనడానికి నిదర్శనమే ఈ సంఘటన. అనవసర భయాలతో టీకా తీసుకునేందుకు నిరాకరించాడో వ్యక్తి. టీకా వేసేందుకు తమ ప్రాంతానికి వచ్చిన ఆరోగ్య కార్యకర్తలను చూసి తేయాకు తోటల్లో పడి పరుగులు తీశాడు. అసోంలో ఈ ఘటన జరిగింది.

author img

By

Published : Dec 2, 2021, 12:11 PM IST

vaccine fear person
కొవిడ్ వ్యాక్సిన్ భయం
ఆరోగ్య సిబ్బందిని చూసి పరుగో పరుగు

Covid vaccine fear: దేశవ్యాప్తంగా 100 కోట్లకుపైగా కొవిడ్​ టీకా డోసులను కేంద్రం పంపిణీ చేసినప్పటికీ.. టీకాపై ఇంకా కొందరికి అపోహలు వీడట్లేదు. వ్యాక్సిన్​ తీసుకుంటే తమకు ప్రాణహాని తలెత్తుందని, వివిధ రోగాలు వస్తాయని చాలా మంది అనవసరపు భయాందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అసోంలోనూ ఇదే తరహా సంఘటన జరిగింది.

అసోం ప్రభుత్వం ఇటీవల 'ఇంటింటికీ టీకా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. నాగావ్​ జిల్లాలోని దిజు వ్యాలీ టీ ఎస్టేట్​లో ఉండే 13 కుటుంబాలకు టీకా పంపిణీ చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే.. వారిని చూసి ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భయంతో తేయాకు తోటల్లో పరుగులు తీశాడు. తనకు టీకా వద్దంటే వద్దంటూ ప్రాధేయపడ్డాడు.

covid vaccine fear person
టీకాకు భయపడి పరుగులు తీసిన వ్యక్తి

అతడికి టీకా వేసేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. వ్యాక్సిన్​ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను అతనికి అర్థమయ్యే విధంగా నచ్చజెప్పారు. అయినప్పటికీ.. అతను భయపడుతూనే ఎట్టకేలకు అంగీకరించాడు. దాంతో తేయాకు తోటల్లోనే అతడికి ఓ నర్సు వ్యాక్సిన్ మొదటి డోసు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

covid vaccine fear person
టీకా వద్దని అధికారులని ప్రాధేయపడుతున్న వ్యక్తి
covid vaccine fear person
ఎట్టకేలకు టీకా వేస్తున్న నర్సు

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్​కు భయపడే ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కరోనా ముప్పును ఎదుర్కోవడానికి వ్యాక్సినే ఏకైక ఆయుధం అని ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేస్తున్నా.. కొందరు మాత్రం లేనిపోని భయాలతో టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.