ETV Bharat / bharat

'రేప్​కు యత్నం.. ప్రతిఘటించిందని పెట్రోల్​ పోసి నిప్పు!' - పెట్రల్​తో దాడి

వివాహితపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. ఈ ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో జరిగింది. నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి యత్నించగా ఆమె ప్రతిఘటించడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

karnataka yadgir district news
వివాహితపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన నిందితుడు
author img

By

Published : Oct 4, 2021, 3:44 PM IST

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. వివాహితపై ఓ వ్యక్తి పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని చికిత్స నిమిత్తం కల్బుర్గీలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని సమీప గ్రామానికి చెందిన గంగప్పగా అధికారులు గుర్తించారు.

పోలీసుల వివరాలు ప్రకారం..

బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై పెట్రోల్​ పోసి నిప్పు పెట్టిన నిందితుడు.. తలుపులు బంధించి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితురాలిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె శరీరం 90 శాతం కాలిపోయింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను కల్బుర్గీలోని ఆసుపత్రికి తరలించారు.

అత్యాచారానికి ప్రయత్నించి..

ఈ ఘటనపై బాధితురాలి బంధువులు సురాపుర పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడని.. ఆమె ప్రతిఘటించడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అంతకుముందు కూడా తరచూ నిందితుడు ఆమె ఇంటికి వచ్చేవాడని.. బాధితురాలిని లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించేవాడని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పంచాయతీలో చర్చ కూడా జరిగిందని.. బాధితురాలి పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై నిందితుడిని హెచ్చరించారని తెలిపారు.

ఇదీ చూడండి : లఖింపుర్ హింసపై విపక్షాలు ఫైర్- కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.