ETV Bharat / bharat

ఆసుపత్రుల్లో 300 మంది రోగుల హత్య?.. 'విషం ఇంజెక్షన్ ఇచ్చి.. రెండు నిమిషాల్లోనే' - పాయిజన్ ఇంజెక్షన్‌తో రోగుల హత్య

పదేళ్లలో దాదాపుగా 300 మంది రోగులను చంపేసినట్లు ఓ వ్యక్తి చెప్పిన వీడియో తమిళనాడులో కలకలం రేపింది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

man-murdered-300-patients-in-ten-years-in-tamilanadu
పదేళ్లలో 300 మంది రోగులను హత్య చేసిన వ్యక్తి
author img

By

Published : Apr 22, 2023, 6:41 AM IST

Updated : Apr 22, 2023, 9:49 AM IST

పదేళ్ల వ్యవధిలో దాదాపు 300 మంది రోగులను హత్య చేసినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి ఈ విషయాన్ని చెబుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మోహన్‌రాజ్‌ (34) నామక్కల్‌ జిల్లా పళ్లిపాలాయానికి చెందిన వ్యక్తి. నిత్యం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తిరుగుతుండేవాడు. శవాగారం వద్ద పని చేస్తున్న వ్యక్తితో కలిసి.. అతడు చెప్పిన పనులన్ని చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో 18వ తేదీన.. అతడు హత్యలు చేసినట్లు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్‌గా మారింది. వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులను.. వారి కుటుంబసభ్యులు, బంధువుల కోరిక మేరకు చంపేవాడినని.. ఆ వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు వెల్లడించాడు. అందుకోసం రూ.5 వేలు తీసుకుంటున్నట్లు వీడియోలో తెలిపాడు.

ఇప్పటి వరకు దాదాపు 300 మందిని.. పదేళ్లలో ఆలా హత్య చేసినట్టు మోహన్‌రాజ్‌ వెల్లడించాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులకు వెళ్లానని మోహన్‌రాజ్‌ తెలిపాడు. రూ.5 వేలు ఇస్తే రెండు నిమిషాలలో పని పూర్తి చేస్తానని వెల్లడించాడు. అనంతరం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ మారింది. దీనిపై పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేసి.. మోహన్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు.. మోహన్‌రాజ్‌ దర్యాప్తులో చెప్పాడని పోలీసులు తెలిపారు.. ఇప్పటి వరకు 18 మంది నకిలీ వైద్యులతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని సమాచారం. పోలీసులు కూడా అతను చేసిన వీడియోపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చెవికి చికిత్స పేరుతో జంట హత్యలు.. ఇంజెక్షన్​ ఓవర్​డోస్​తో తల్లీకూతుళ్లు బలి..
కొంత కాలం క్రితం గుజరాత్​లోని ఓ ఆసుపత్రిలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అహ్మదాబాద్‌లోని ఓ ఇ.ఎన్​.టి ఆసుపత్రిలో తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. ఆసుపత్రి కాంపౌండర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. గత 15 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్​లో పనిచేస్తున్న ఆ కాంపౌండర్.. చికిత్స కోసం వచ్చిన వారికి మాయమాటలు చెప్పాడు. డాక్టర్​ లేని సమయం చూసి.. అధిక డోస్​ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. అనంతరం ఆసుపత్రిలో అల్మారాలో మృతదేహాలను ఉంచాడు. ఆ సమయంలో గంట పాటు ఆసుపత్రి సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 22, 2023, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.