యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడికి జైలులోనే వివాహం జరిపించారు అధికారులు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగింది. దీపక్ అనే వ్యక్తికి అతడు ప్రేమించిన యువతితో పండితులు, జైలు అధికారుల సమక్షంలో కల్యాణం అయింది.
ఇదీ సంగతి..
22 ఏళ్ల యువతిని ప్రేమించిన దీపక్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం మొండికేశాడు. గ్రామ పెద్దలు మందలించినా ససేమిరా అన్నాడు. దీంతో యువతి అతడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

యువతిని మోసగించిన కేసులో 2020 నవంబర్ 2 నుంచి అతడు కాంకేర్ జిల్లా జైల్లో ఉంటున్నాడు. ఎట్టకేలకు ఆమెతో పెళ్లికి అంగీకరించాడు. వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు వారి పెళ్లికి ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: కాశీలో నడ్డా, గువాహటిలో ప్రియాంక పూజలు