ETV Bharat / bharat

వయసు 60+.. 14 మందికి భర్త.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరకు.. - odisha latest crime news

Man marries 14 women: "మాట్రిమోని వెబ్​సైట్ ద్వారా పరిచయం.. నైస్​గా కబుర్లు చెప్పి పెళ్లి.. భార్య దగ్గర డబ్బులు తీసుకుని పరార్".. ఒడిశాకు చెందిన ఓ వృద్ధుడి ఘరానా మోసం సాగే తీరిది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7 రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళల్ని పెళ్లి చేసుకుని, మోసగించాడు ఆ ఘనుడు. చివరకు అరెస్టయ్యాడు.

Man marries 14 women in 7 states, held in Odisha

author img

By

Published : Feb 15, 2022, 8:47 AM IST

Updated : Feb 15, 2022, 11:14 AM IST

Man marries 14 women: గత 48 ఏళ్లలో ఏడు రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళల్ని పెళ్లి పేరుతో మోసగించిన వృద్ధుడిని ఒడిశా భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, మరికొన్ని కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

48 ఏళ్లుగా..

ఒడిశా కేంద్రపరా జిల్లా పట్కురా ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడి వయసు ప్రస్తుతం 60ఏళ్లపైనే. అతడికి 1982లో తొలిసారి వివాహం అయింది. 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. తొలి రెండు వివాహాలతో అతడికి ఐదుగురు పిల్లలు పుట్టారు. మొదటి భార్యలు ఇద్దరూ ఒడిశా వారే.

Man marries 14 women in 7 states, held in Odisha
కొన్నేళ్ల కిందట వివాహం సమయంలో..

2002 నుంచి 2020 వరకు అతడు నిత్యపెళ్లికొడుకుగా చెలరేగిపోయాడు. మధ్యవయసులో ఉన్న ఒంటరి మహిళలు, ముఖ్యంగా విడాకులు తీసుకుని భాగస్వామి కోసం చూస్తున్న మహిళలే అతడి టార్గెట్. మాట్రిమోని వెబ్​సైట్​ల ద్వారా అలాంటి వారికి వల వేసేవాడు. తాను వైద్యుడినని చెప్పుకునేవాడు. న్యాయవాదులు, వైద్యులు, బాగా చదువుకున్న ఒంటరి మహిళలకు ఎరవేసేవాడు. పెళ్లి అయ్యాక వారి దగ్గర డబ్బులు తీసుకుని మాయం అయ్యేవాడు. ఇలా దిల్లీ, పంజాబ్, అసోం, ఝార్ఖండ్​, ఒడిశాకు చెందిన వారిని మోసగించాడు ఆ వ్యక్తి. పారా మిలటరీలో పనిచేసే ఓ మహిళ కూడా ఇతడి బాధితురాలేనని తెలిసింది.

వివాహ సమయంలో ఫొటోలు తీసుకుంటూ..

ఆఖరి భార్య ఫిర్యాదుతో..

2018లో దిల్లీలో 14వ పెళ్లి చేసుకుని.. భార్యను భువనేశ్వర్ తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. స్కూల్ టీచర్​గా చేస్తున్న ఆమెకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. 14వ భార్య.. భువనేశ్వర్​లోని మహిళా పోలీస్​ స్టేషన్​లో గతేడాది జులైలో ఇదే విషయంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గతంలో హైదరాబాద్​, ఎర్నాకులంలో నిరుద్యోగ యువతను మోసగించడం, లోన్ ఫ్రాడ్ కేసుల్లో అతడు రెండుసార్లు అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు.

14 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి ఇతడే..

అయితే.. 14 మందిని పెళ్లాడి, మోసగించాడన్న ఆరోపణల్ని నిందితుడు తోసిపుచ్చాడు.

అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి. భార్యను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అనూహ్యంగా దారి మధ్యలోనే డబ్బు, నగలతో మాయమైంది వధువు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెప్పిన విషయాలు విని అతడు ఖంగుతిన్నాడు. తనలాగే ఆమె మరో ఏడుగురిని పెళ్లాడి, నట్టేట ముంచేసిందని ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అంతకుముందు మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లోని కోలార్​ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పెళ్లి పేరుతో 13 మందిని మోసం చేసిందో ఓ బృందం. నకిలీ మ్యాట్రిమోనియల్​ వెబ్​సైట్​తో​ నడపుతూ.. పెళ్లిపై ఆసక్తి చూపించేవారిని లక్ష్యంగా చేసుకుని ఒకే యువతి ఫొటోతో వారందరినీ బురిడీ కొట్టించింది. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి: పెళ్లి పేరుతో వల.. యువతులకు రూ.లక్షల్లో టోకరా

ప్రేమించిన వ్యక్తికి వేరే అమ్మాయితో పెళ్లి... షాకిచ్చిన ప్రేయసి!

భార్య నిత్యలక్ష్మి.. భర్త 'నిత్య' పెళ్లి కొడుకు!

వాట్సాప్ స్టేటస్​కు నిండు ప్రాణం బలి- కుమార్తె పనికి తల్లి మృతి

Last Updated : Feb 15, 2022, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.