ETV Bharat / bharat

టవల్​ ఆలస్యంగా ఇచ్చిందని భార్యను దారుణంగా చంపిన భర్త - తువ్వాలు ఇవ్వలేదని దారుణ హత్య

మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్​ జిల్లాలో లేటుగా తువ్వాలు ఇచ్చిందన్న కారణంతో ఓ వ్యక్తి.. భార్యను దారుణ హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

man kills wife towel
తువ్వాలు ఇవ్వలేదని భార్య దారుణ హత్య
author img

By

Published : Nov 8, 2021, 12:34 PM IST

అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదని భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్​ జిల్లాలో హీరాపుర్​ గ్రామంలో శనివారం జరిగింది. నిందితుడు అటవీ శాఖకు చెందిన ఉద్యోగి రాజ్​కుమార్​ బాహేగా పోలీసులు గుర్తించారు.

కుమార్తెను బెదిరించి..

శనివారం సాయంత్రం స్నానం ముగించుకున్న రాజ్​కుమార్​... భార్య పుష్పా బాయ్​ (45)ను టవల్​ అడిగాడు. ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని తువ్వాలు కావాలంటే కాసేపు ఆగాలని చెప్పిన భార్య.. కాస్త ఆలస్యంగా అతనికి టవల్​ అందించింది. భార్య ఆలస్యంగా తువ్వాలు ఇవ్వడం వల్ల రాజ్​కుమార్​ కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో అక్కడే ఉన్న పారతో భార్య తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన కుమార్తెను బెదిరించాడు. రాజ్​కుమార్​ దాడికి పుష్పా అక్కడిక్కడే మృతిచెందింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదివారం సాయంత్రం అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : షూలో దూరిన పాము.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.