ETV Bharat / bharat

ఆమె కోసం 16 ఏళ్ల బాలుడ్ని చంపిన యువకుడు - maharashtra murder news latest

Man killed teen in maharashtra: తాను ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉన్నాడన్న కోపంతో ఓ యువకుడు.. 16 ఏళ్ల బాలుడ్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

man killed teen in maharashtra
ఆమె కోసం 16 ఏళ్ల బాలుడ్ని చంపిన యువకుడు
author img

By

Published : Feb 26, 2022, 5:54 AM IST

Man killed teen in maharashtra: తాను ప్రేమించిన యువతితో మరొక యువకుడు చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతడ్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

థానే జిల్లాలోని బందర్​పడాకు చెందిన కల్యాణ్ ప్రాంతానికి చెందిన యాసిన్ షేక్​ ఇమ్రాన్(20) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ​అయితే ఆమెతో అర్మాన్ సయ్యిద్​(16) చనువుగా ఉంటున్నాడు. యువతి విషయంలో ఇది వరకే ఇమ్రాన్, సయ్యిద్ మధ్య చాలాసార్లు ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో సయ్యిద్​ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసిన ఇమ్రాన్.. మాయమాటలు చెప్పి సయ్యిద్​ను పొలంలోకి తీసుకెళ్లాడు. అక్కడే కిరాతకంగా కొడవలితో నరికి చంపాడు.

బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఘటన జరిగిన ఐదు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: పుట్టింటికి వెళ్లిందని భార్యపై ఆత్మాహుతి దాడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.