ETV Bharat / bharat

ఫోన్ పగులకొట్టాడని.. కూలీని హత్య చేసిన యువకుడు.. - maharastra crime news

Man killed For Breaking Mobile Phone: ఫోన్ పగులకొట్టాడని ఓ కూలీని హత్య చేశాడో యువకుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది.

nagpur crime news
హత్య
author img

By

Published : Mar 25, 2022, 10:47 AM IST

Updated : Mar 25, 2022, 11:44 AM IST

Man killed For Breaking Mobile Phone: మహారాష్ట్ర నాగ్‌పుర్​లో దారుణం జరిగింది. ఫోన్ పగులకొట్టాడనే కారణంతో ఓ కూలీని హత్య చేశాడో యువకుడు. బాధితుడు సలీరామ్​ అలియాస్ రింకు కుమార్(31), నిందితుడు ఉత్తర్​ప్రదేశ్​ సిద్ధార్ద్​ నగర్ జిల్లాకు చెందినవారు. పనికోసం వలస వచ్చి నాగ్​పుర్​లో ఒకే దగ్గర నివసిస్తున్నారు. ఈ క్రమంలో రింకు కుమార్​ తన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఫోన్ చేయాలనుకున్నాడు. పక్కనే ఉన్న యువకున్ని ఫోన్​ అడిగాడు. అందుకు నిందితుడు ఒప్పుకోలేదు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం అదే ఫోన్​లో మాట్లాడిన కుమార్​.. మొబైల్​ను నేలకు కొట్టాడు. దీంతో ఫోన్ పగిలిపోయింది. ఆగ్రహంతో యువకుడు కుమార్​పై దాడి చేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. రింకు కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: మూడో భార్యతో కలిసి రెండో భార్య హత్య.. పెట్రోల్ పోసి నిప్పంటించి..

Last Updated : Mar 25, 2022, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.