ETV Bharat / bharat

'ముసలాడే కానీ.. మహానుభావుడు'.. మద్యం కోసం ఏకంగా మనవడి కిడ్నాప్ - Man kidnaps his grandson for alcohol in hyderabad

Man kidnaps his grandson for alcohol : మనవడిని అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తాతయ్య మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత మనవడినే కిడ్నాప్​ చేశాడు. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన పసిపిల్లాడు కనిపించకపోవడంతో ఆ మాతృమూర్తి తల్లడిల్లుతోంది. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో జరిగిన ఈ ఘటన అందరిని కలిచి వేస్తోంది.

Man kidnaps his grandson for alcohol
Man kidnaps his grandson for alcohol
author img

By

Published : May 17, 2023, 1:46 PM IST

Man kidnaps his grandson for alcohol : తల్లి దండ్రులు చనిపోతే అన్ని తానై చూసుకుని మనవడు, మనవరాళ్లను గొప్పగా తీర్చిదిద్దిన తాతయ్య కథలు ఎన్నో విన్నాం. మనవళ్లను చూసి అపూరంగా మురిసిపోయే వాళ్లను చూశాం. తమ పిల్లల పిల్లల కోసం కష్టపడి సంపాదించిన ఆస్తిని కూడా వారిపై ప్రేమతో పంచి ఇచ్చిన అవ్వతాతలు ఎందరో. కానీ హైదరాబాద్​లో ఓ తాతయ్య చేసిన పని మాత్రం ఆ బంధానికే మాయని మచ్చ తెచ్చింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..?

Man kidnaps his grandson for alcohol in Hyderabad : మద్యం తాగేందుకు డబ్బు అడిగితే ఇవ్వలేదని ఏకంగా తల్లి పొత్తిళ్లలో నుంచి మనవడిని ఎత్తుకెళ్లాడు ఓ వ్యక్తి. పొత్తిళ్లలో బిడ్డ కనిపించకపోయేసరికి ఆ తల్లి విలవిలలాడిపోతోంది. కన్నా.. ఎక్కడున్నావ్.. ఆకలి వేస్తోందా అంటూ తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్​లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేటకు చెందిన యస్మీన్​ బేగం కాన్పు కోసం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. నెల రోజుల క్రితం పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. బాబుకు ఫైజన్ అని పేరు కూడా పెట్టారు.

Man kidnaps his grandson for money to buy alcohol : ఈనెల 15వ తేదీన యస్మీన్ తండ్రి.. మహ్మద్ ఖలీల్ మద్యం తాగేందుకు డబ్బులు కావాలని అడిగాడు. కుటుంబ సభ్యులు ఇవ్వకపోవడంతో వారితో గొడవకు దిగాడు. నాకే డబ్బివ్వరు కదా.. మీ సంగతి చూస్తానంటూ ఆ క్షణం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసనుకుంటూ రాత్రి పూట ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో వాళ్లంతా నిద్రపోతున్నారు. ఇదే అదనుగా భావించి తన కుమార్తె పొత్తిళ్లలో నిద్రపోతున్న బాబును ఎత్తుకెళ్లిపోయాడు ఖలీల్.

కాసేపటికి లేచిన యస్మీన్ తన పక్కన కుమారుడు కనిపించకపోయే సరికి ఏడుస్తున్నాడని.. తల్లి తీసుకెళ్లిందేమోనని ఆమె వద్దకు వెళ్లింది. తల్లి వద్ద కూడా తన కొడుకు కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. చుట్టుపక్కల వారిని అడిగింది. ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో తన తండ్రి ఇంట్లో లేడన్న విషయం గుర్తొచ్చింది. తన తండ్రే తన కుమారుడిని ఎత్తుకెళ్లి ఉంటాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. తన తండ్రిపై యస్మీన్ అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా బాబుని వెతికిపట్టుకుంటామని ఆమెకు భరోసానిచ్చారు.

కన్నా నువ్వు ఎక్కడ: నెలల వ్యవధి ఉన్న పసికందు కనిపించకపోవడం ఫైజన్ తల్లి తల్లడిల్లుతోంది. కన్నా ఎక్కడ ఉన్నావ్​.. ఆకలి వేస్తోందా..! అంటూ తీవ్రంగా రోదిస్తోంది. మద్యం కోసం తన తండ్రి ఇంత పనిచేస్తాడని అనుకోలేదని తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.