ETV Bharat / bharat

మద్యం మత్తులో దారుణం- తల్లిదండ్రులను గొడ్డలితో నరికి.. - అమ్మానాన్న చంపిన ఘటన

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కన్న తల్లిదండ్రులనే గొడ్డలితో నరికి హత్య చేశాడు.

man kills parents
మద్యం మత్తులో తల్లిదండ్రుల హత్య
author img

By

Published : Sep 8, 2021, 9:06 PM IST

Updated : Sep 8, 2021, 9:39 PM IST

కేరళ త్రిస్సూర్​లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి.. పేగు బంధాన్నే మరిచాడు. కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి, బుధవారం కోర్టులో హాజరుపరిచారు.

man kills parents
కారుతేదత్​ రామకృష్ణన్​, తంకామణి, నిందితుడు ప్రదీప్​(చివరి వ్యక్తి)

అసలేం జరిగింది?

త్రిస్సూర్​ జిల్లా అవినిస్సేరిలో కారుతేదత్​ రామకృష్ణన్​(75), ఆయన భార్య తంకామణి నివసిస్తున్నారు. అయితే.. మద్యానికి బానిసైన వారి కుమారుడు ప్రదీప్​.. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. గుమ్మంలో నిల్చుని తల్లిదండ్రులు మాట్లాడతుండగా.. వారిపై అతడు గొడ్డలితో దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడ్డ వారిద్దరినీ.. త్రిస్సూర్​ జనరల్​ ఆస్పత్రికి, అక్కడి నుంచి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే... అక్కడ చికిత్స పొందుతున్న ప్రదీప్​ తల్లి మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. ప్రదీప్​ తండ్రి రామకృష్ణన్ బుధవారం ఉదయం మృతిచెందాడు.

ప్రదీప్​ తరచూ మద్యం సేవించి, ఇంట్లో గొడవ చేస్తాడని స్థానికులు తెలిపారు. ప్రదీప్​ను తన భార్య, కుమార్తె వదిలేసి వేరుగా ఉంటున్నారని చెప్పారు.

ఇదీ చూడండి: ఒక్క కామెంట్​తో కల సాకారం.. ఆస్పత్రి బెడ్ నుంచి స్టార్​ మోడల్​గా...

Last Updated : Sep 8, 2021, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.