ETV Bharat / bharat

పెళ్లి పేరుతో 200 మంది యువతులకు టోకరా- సర్వం దోచేసి.. - ఉత్తర్​ప్రదేశ్​ బస్తీ జిల్లా

Man Held For Cheating: మాట్రిమోనీ వెబ్​సైట్​ తనను మోసం చేసిందంటూ ఓ యువతి పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. తన నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని విస్తుపోయారు. ఆ వెబ్​సైట్​ ద్వారా మోసపోయిన అమ్మాయిల సంఖ్య 200లకుపైనే అని నిర్ధరించుకుని ఖంగుతిన్నారు.

Man Held For Cheating
మ్యారేజ్​ బ్యూరో పేరుతో ట్రాప్
author img

By

Published : Apr 7, 2022, 2:32 PM IST

Man Held For Cheating: మాట్రిమోనీ సైట్​ పేరుతో 200 మందికిపైగా యువతులను మోసం చేశాడు ఓ కిలాడీ. రెండేళ్ల క్రితం లాక్​డౌన్​ సమయంలో వెబ్​సైట్​ ఓపెన్​ చేసిన నిందితుడు.. మంచి సంబంధాలు కుదుర్చుతానంటూ ఎందరో యువతులకు వల వేశాడు. జాతక దోషాలు ఉన్నాయని, అవి సరిచేసేందుకు పూజలు చేయిస్తానని నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకునేవాడు. తీరా డబ్బులు తన ఖాతాలో పడ్డాక ఎవరికీ స్పందించేవాడు కాదు.

చనిపోయినట్లు నమ్మించి..: డబ్బులు ఇచ్చిన బాధితులు ఒత్తిడి చేస్తే వారి నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్లు నాటకం ఆడేవాడు. సోషల్​ మీడియా, వెబ్​సైట్లలో తన ప్రొఫైల్​ ఫొటోను మార్చేసేవాడు. చనిపోయాడని నమ్మించడానికి దండ వేసి ఉన్న ఫొటోను పెట్టేవాడు. దీంతో చాలా మంది యువతులు అది నిజమే అని వదిలేశారు. అయితే ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుతో ఇదంతా బయటపడింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడిని గాజియాబాద్​కు చెందిన తరుణ్​ కుమార్​గా గుర్తించారు. అతడ్ని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : 'పరువు' కోసం ప్రేమపై తండ్రి పగ.. సొంత కుమార్తె దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.