రాజస్థాన్ బర్మార్ జిల్లా కేసుంబ్లా ప్రాంతానికి చెందిన ఇషాక్ ఖాన్.. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితమే ఇషాక్కు వివాహం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇషాక్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆయన సతీమణి.. పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇషాక్ బలవర్మణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పంచనామా అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇదీ చదవండి: Earthquake news: ఆ రాష్ట్రాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు