ETV Bharat / bharat

బలవంతంగా బీఫ్ తినిపించిన భార్య, మనస్తాపంతో భర్త ఆత్మహత్య - బీఫ్​ను భార్య బలవంతంగా తినిపించిందని భర్త ఆత్మహత్య

బలవంతంగా భార్య, బావమరిది కలిసి బీఫ్ తినిపించారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

man committed suicide
ఆత్మహత్య
author img

By

Published : Aug 30, 2022, 10:41 AM IST

భార్య, బావమరిది కలిసి బలవంతంగా బీఫ్ తినిపించారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం గుజరాత్​.. సూరత్​లోని ఉఢానాలో జరిగింది. జూన్​ 27న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు కారణమైన నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని రోహిత్​ సింగ్​గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రోహిత్ సింగ్ సూరత్​లోని టెక్స్​టైల్ మిల్లులో రంగులు అద్దకం పని చేసేవాడు. అక్కడే అతడికి సోనమ్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. రోహిత్ కుటుంబ సభ్యులు వీరిని ఇంటికి రానివ్వకపోవడం వల్ల రోహిత్, సోనమ్ వేరే కాపురం పెట్టారు. ఈ క్రమంలో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సోనమ్, బావమరిది అక్తర్ అలీ తనను హింసిస్తున్నారని, బలవంతంగా బీఫ్ తినిపించారని ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్‌ను పోస్టు చేశాడు. ఈ సూసైడ్​ నోట్​ను రోహిత్ స్నేహితుడు చూడడం వల్ల దారుణం బయటపడింది.

"బీఫ్ తినకుంటే చంపేస్తామని మృతుడి భార్య సోనమ్​, బావమరిది అక్తర్ బెదిరించారు. ఓ రోజు బలవంతంగా బీఫ్ తినిపించారు. దీంతో రోహిత్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సూసైడ్‌ నోట్‌ రాసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు బాధితుడు. రోహిత్ స్నేహితుడు సోషల్​ మీడియాలో సూసైడ్ నోట్​ను చూడడం వల్ల దారుణం బయటపడింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. నిందితులిద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం."
-పోలీసులు

ఇవీ చదవండి: ఇంట్లో బంగారు నిధి, గుట్టుగా పంచుకున్న కూలీలు, తప్పతాగి నోరుజారేసరికి

చీమల దండయాత్ర, చూపు కోల్పోతున్న పశువులు, వలస వెళ్తున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.