ETV Bharat / bharat

Man Attack with Blade on Woman in Visakha: విశాఖలో దారుణం.. బ్లేడుతో యువతిపై ప్రేమోన్మాది దాడి - విశాఖ లేటెస్ట్ న్యూస్

Man_Attack_with_Blade_on_Woman
Man_Attack_with_Blade_on_Woman
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 12:45 PM IST

Updated : Sep 5, 2023, 4:08 PM IST

12:40 September 05

అర్ధరాత్రి యువతి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వెళ్లి యువతిపై దాడి

Man Attack with Blade on Woman in Visakha: విశాఖలో దారుణం.. బ్లేడుతో యువతిపై ప్రేమోన్మాది దాడి

Man Attack with Blade on Woman in Visakha: ప్రేమోన్మాదుల ఆగడాలు రోజు రోజుకూ పెచ్చు మీరుతున్నాయి. ప్రియురాలు దక్కలేదనే కోపంతో.. ఉన్మాదుల్లా మారిపోతున్న యువకులు.. చంపటానికి కూడా వెనకాడటం లేదు. కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నా వారి తీరు మాత్రం మారటం లేదు. ఇలాంటి ఘటనే విశాఖలో చోటు చేసుకుంది. జిల్లాలోని శ్రీహరిపురంలో ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. రామారావు అనే యువకుడు, బాధిత యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రామారావు ఉద్యోగం చేయట్లేదని వీరిరువురి మధ్య వివాదం నెలకొంది. దీంతో అర్ధరాత్రి యువతి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆమెపై బ్లేడుతో యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువతి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. మిత్తి రెడ్డి లతాశ్రీ(19) అనే యువతి, నేతేటి రామారావు (26) అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడు రామారావు ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో ఇరువురికి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో యువతి అతడిని పక్కన పెట్టింది. దీంతో ప్రియురాలిపై కక్షపెట్టుకున్న ఆ యువకుడు ప్రేమోన్మాదిలా మారి.. నిన్న అర్ధరాత్రి యువతి ఇంటికి వెళ్లి ఆమెపై బ్లేడుతో మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. దీనిపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రామారావుని అదుపులోకి తీసుకున్నారు.

"మిత్తి రెడ్డి లతాశ్రీ(19) అనే యువతి, నేతేటి రామారావు (26) అనే యువకుడు గత పది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో కూడా తెలుసు. అయితే గత 20 రోజుల నుంచి ఆ యువతి.. యువకుడిని పక్కన పెట్టడం జరిగింది. అతడి ప్రేమను రిజక్ట్ చేయటంతో యువకుడు.. ఆమెపై కక్ష పెట్టుకుని.. సోమవారం అర్ధరాత్రి యువతి ఇంటికి వెళ్లి ఆమెపై బ్లేడుతో మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము." - జీ.డి బాబు, సీఐ

Last Updated : Sep 5, 2023, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.