ETV Bharat / bharat

నకిలీ బ్యాంక్​తో భారీ స్కామ్.. 10 బ్రాంచ్​లు నడుపుతూ కోట్లు మోసం.. చివరకు..

నకిలీ బ్యాంక్​ను స్థాపించిన ఓ వ్యక్తి దాని ద్వారా ఆ ప్రాంతంలోనే పలు బ్రాంచ్​లను ఏర్పాటు చేసి ఖాతాదారులను మోసం చేయాలనుకున్నాడు. అలా 2 కోట్లతో పరారవ్వాలనుకున్న ఓ వ్యక్తి ఆఖరికి కటకటాలపాలయ్యాడు.

Man arrested for running fake banks in tamilnadu
Man arrested for running fake banks
author img

By

Published : Nov 9, 2022, 4:17 PM IST

ఆర్‌బీఐ బ్యాంక్ అప్రూవల్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసిన ఓ వ్యక్తి ఏకంగా ఓ నకిలీ బ్యాంక్​ను స్థాపించాడు. వేర్వేరు ప్రాంతాల్లో ఆ బ్యాంక్​కు సంబంధించిన బ్రాంచ్​లను ఓపెన్​ చేశాడు. జనానికి దాదాపు రూ.2 కోట్లకు టోకరా వేయాలనుకున్నాడు. ఆఖరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. తమిళనాడులోని క్రైమ్​ బ్రాంచ్​కు వచ్చిన ఈ తాజా కేసును చూసిన పోలీసులు షాకయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. చంద్రబోస్​ అనే వ్యక్తి తనకు ఎవరూ అడ్డు చెప్పరన్న ధీమాతో ఓ నకిలీ సహకార బ్యాంక్​ను స్థాపించి.. తమిళనాడులోని తిరుమంగళం, నమక్కల్, తిరువణ్నామలై, విరుధాచలం, పెరంబలూరు, సేలం లాంటి ప్రాంతాల్లో దాదాపు 10కి పైగా శాఖలను ఏర్పాటు చేసి తన కార్యకలాపాలను కొనసాగించాడు. కళ్లకురిచ్చి, ఈరోడ్ ప్రాంతాల్లోనూ సామాన్య ప్రజలను ఆకట్టుకున్న ఆ వ్యక్తి అక్కడ కూడా తన నకిలీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇందుకోసం ఆర్​బీఐకి సంబంధించిన ఓ ఫేక్​ అప్రూవల్​ సర్టిఫికేట్​ సైతం తయారు చేశాడు. బ్యాంక్​ నిజమని నమ్మించేందుకు దాని పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, పాస్‌బుక్‌లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇలా బ్యాంక్​కు సంబంధించిన వివిధ పత్రాలను ముద్రించి ఖాతాదారులకు అందించాడు. అలా 2016లో స్థాపించిన ఆ బ్యాంక్​ ద్వారా అతని వలలో దాదాపు 3000 మంది చిక్కుకున్నారు. వీరివద్ద నుంచి సుమారు 2 కోట్లు వరకు కాజేశాడు చంద్రబోస్​.

Man arrested for running fake banks in tamilnadu
చంద్రబోస్​ స్థాపించిన నకిలీ బ్యాంక్​

ఎట్టకేలకు అతని మోసపూరిత చర్యలు బయటపడటం వల్ల పోలీసులు ఆ నకిలీ బ్యాంకు నుంచి రూ.57 లక్షలు, లగ్జరీ కారు, అలాగే కొన్ని ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్​లో చంద్రబోస్‌కు సహకరించిన వారెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:కబడ్డీ బాగా ఆడుతున్నాడని బాలుడి హత్య.. కిడ్నాప్ చేసి రాయితో తలపై కొట్టి..

గుజరాత్​లో కాంగ్రెస్​కు షాక్​.. 10 సార్లు గెలిచిన ఎమ్మెల్యే భాజపా గూటికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.