ETV Bharat / bharat

నందిగ్రామ్ నుంచి నేడు మమత నామినేషన్

నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే స్థానం నుంచి పోటీలో ఉన్న భాజపా అభ్యర్థి సువేందు అధికారి.. మార్చి 12న నామపత్రాలు సమర్పించనున్నారు.

Mamata to file nomination from Nandigram today
నందిగ్రామ్ నుంచి నేడు మమత నామినేషన్
author img

By

Published : Mar 10, 2021, 5:49 AM IST

Updated : Mar 10, 2021, 6:50 AM IST

బంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న దీదీ.. సాయంత్రం ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం కార్యకర్తలతో సమావేశమై, మార్చి 11న కోల్​కతాకు తిరుగుపయనమవుతారని చెప్పాయి.

కాగా, ఇదే స్థానం నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్న సువేందు అధికారి మార్చి 12న నామినేషన్ వేయనున్నారు. నామపత్రాలు సమర్పించిన తర్వాత ర్యాలీలో పాల్గొంటారని భాజపా నేతలు చెప్పారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం నుంచి టీఎంసీ తరపున సువేందు గెలుపొందారు. అంతకుముందు కూడా ఈ స్థానం టీఎంసీ చేతిలోనే ఉంది. అయితే పార్టీలో నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరిన సువేందు.. ప్రస్తుతం దీదీతో తలపడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 10, 2021, 6:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.