ETV Bharat / bharat

'వాటర్​గేట్​ కుంభకోణం కంటే పెగాసస్​ దారుణం' - Meenakshi Lekhi

పెగాసస్​.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో బంగాల్​ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరిగిన వాటర్​గేట్​ కుంభకోణం కంటే పెగాసస్ దారుణమైందని పేర్కొన్నారు. భాజపా తన సొంత మంత్రులు, అధికారులనే నమ్మడం లేదని విమర్శించారు.

Mamata
మమత
author img

By

Published : Jul 23, 2021, 7:30 AM IST

పెగాసస్ గూఢచర్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. ఇది అమెరికా వాటర్‌గేట్​ కుంభకోణం కంటే దారుణమైందని వ్యాఖ్యానించారు. అన్ని నిష్పాక్షిక సంస్థలను భాజపా ప్రభుత్వం రాజకీయం చేసిందని దీదీ ఆరోపించారు.

"పెగాసస్.. వాటర్‌గేట్ కుంభకోణం కంటే ఘోరంగా ఉంది. ఇది సూపర్ ఎమర్జెన్సీ. భాజపా తన సొంత మంత్రులు, అధికారులను కూడా నమ్మడం లేదు. ఆర్​ఎస్​ఎస్​ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు విన్నాను." అని దీదీ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇతరులపై ఈ స్పైవేర్​ సాయంతో ప్రభుత్వ సంస్థలు నిఘా పెట్టాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఆరోపణలన్నీ కల్పితాలే'

పెగాసస్​ స్పైవేర్​ అంశంపై ఆరోపణలు నిరాధారమైనవని, కల్పితాలని భాజపా పేర్కొంది. పెగాసస్​ ప్రాజెక్టుతో సంబంధమున్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్​​ పేర్కొన్న జాబితాను ఖండించారు భాజపా నేత, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి. నకిలీ జాబితాను చూపించి బూటకపు వార్తలు ప్రసారం చేశారని ఆరోపించారు.

ఇదీ చూడండి: సుప్రీంకు 'పెగాసస్' వ్యవహారం- సిట్ దర్యాప్తునకు విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.