బంగాల్లో పోలింగ్ తీరుపై ఎన్నికల సంఘాన్ని విమర్శించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సూచనలతోనే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా.. అధికారులు తగు చర్యలు తీసుకోట్లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈసీకి 63 ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
నందిగ్రామ్‌లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించారు మమత. బోయల్ ప్రాంతంలోని బూత్ నెం.7 బయట వీల్‌ఛైర్‌లో కూర్చుని ఈ వ్యాఖ్యలు చేశారు.
''మేం ఉదయం నుంచి 63 ఫిర్యాదుల్ని నమోదు చేశాం. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ అంశంపై మేం కోర్టుకెళ్తాం. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన గూండాలు ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.''
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
గవర్నర్‌కు ఫోన్..
నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన దీదీ.. అక్కడి నుంచే గవర్నర్ జగదీప్ దన్ఖర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ''ఉదయం నుంచి స్థానికులను ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. మీరే జోక్యం చేసుకోవాలి.'' అని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు మమత.
-
#WATCH: West Bengal CM Mamata Banerjee speaks to Governor Jagdeep Dhankhar over the phone at a polling booth in Nandigram. She says, "...They didn't allow the local people to cast their vote. From morning I am campaigning...Now I am appealing to you, please see..." pic.twitter.com/mjsNQx38BB
— ANI (@ANI) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: West Bengal CM Mamata Banerjee speaks to Governor Jagdeep Dhankhar over the phone at a polling booth in Nandigram. She says, "...They didn't allow the local people to cast their vote. From morning I am campaigning...Now I am appealing to you, please see..." pic.twitter.com/mjsNQx38BB
— ANI (@ANI) April 1, 2021#WATCH: West Bengal CM Mamata Banerjee speaks to Governor Jagdeep Dhankhar over the phone at a polling booth in Nandigram. She says, "...They didn't allow the local people to cast their vote. From morning I am campaigning...Now I am appealing to you, please see..." pic.twitter.com/mjsNQx38BB
— ANI (@ANI) April 1, 2021
సువేందు విమర్శలు..
ఓటర్లను మమతా బెనర్జీ అవమానిస్తున్నారని ఎదురుదాడికి దిగారు నందిగ్రామ్ భాజపా అభ్యర్థి సువేందు అధికారి.
''ఓటర్లను అవమానించడం మమతా బెనర్జీకి అలవాటుగా మారింది. ఆమెకు ప్రమాదంలో గాయాలయ్యాయి. కానీ వేరేవాళ్లపై ఆరోపణలు చేశారు. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఆమె.. గవర్నర్‌తో మాట్లాడితే మాకేం సమస్య లేదు. పోలింగ్ ఈసీ నిర్వహిస్తోంది. గవర్నరో, రాష్ట్రపతో కాదు.''
- సువేందు అధికారి, నందిగ్రామ్ భాజపా అభ్యర్థి
ఇవీ చదవండి: